మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘SYG (సంబరాల ఏటిగట్టు)’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రోహిత్ కె.పీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ముంబైలో నిర్వహించిన కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం విశేషం. అయితే ఆయన వివరాలను మేకర్స్ ప్రస్తుతం గోప్యంగా ఉంచారు.
ప్రతి షెడ్యూల్‌తో సినిమా స్కేల్‌ను మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్న ‘SYG’, నిజమైన పాన్-ఇండియా స్పెక్టకల్‌గా రూపుదిద్దుకుంటోంది. జాతీయ స్థాయి నటీనటుల భాగస్వామ్యం ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ తీసుకురానుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాలో సాయి దుర్గా తేజ్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, చాలెంజ్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ప్రపంచ స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణం సాగిస్తున్న మేకర్స్, ప్రతి అంశంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలు, అద్భుతమైన విజువల్ స్కేల్, భారీ స్టార్ క్యాస్ట్‌తో ఈ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
‘హనుమాన్’ విజయానంతరం ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతుండగా, త్వరలో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ రానున్నట్లు సమాచారం.