peddi-nears-300-crore-mark-strong-overseas-collections
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజే రూ.135 కోట్ల గ్రాస్‌ను అందుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో రూ.236 కోట్ల మార్క్‌ను దాటేసింది. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ కారణంగా తొలి వీకెండ్ ముగిసే సమయానికి రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరుతుందని అందరూ అంచనా వేశారు. అయితే ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. కేవలం రూ.7.5 కోట్ల దూరంలోనే ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను మిస్ అయినప్పటికీ, ఈ కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకుంటున్నాయి.
peddi-nears-300-crore-mark-strong-overseas-collections
ఇక విదేశీ మార్కెట్లలో కూడా ‘పెద్ది’ తన సత్తా చాటుతోంది. తాజాగా విడుదలైన అధికారిక సమాచారం ప్రకారం యూకే, ఐర్లాండ్‌లో ఈ చిత్రం £325,000 (దాదాపు నాలుగున్నర కోట్లు) గ్రాస్ వసూళ్లు సాధించింది. అక్కడి తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయ సినీ అభిమానులు సినిమాకు మంచి ఆదరణ చూపుతున్నారని మూవీ టీమ్ చెబుతోంది. ఓవర్సీస్లో స్థిరమైన వసూళ్లు నమోదు కావడం సినిమాకు అదనపు బలంగా మారింది. ప్రత్యేకంగా రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు సానా తీసిన ఎమోషనల్ సీన్స్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ అంశాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
peddi-nears-300-crore-mark-strong-overseas-collections
నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ సాధించడం చిన్న విషయం కాదు. ఇదే జోరు కొనసాగితే వీక్‌డేస్‌లోనే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్క్‌ను దాటేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు ‘పెద్ది’ ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి ట్రిపుల్ సెంచరీని కొద్దిలో మిస్ అయినా, ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ బలమైన వసూళ్లతో రామ్ చరణ్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపిస్తున్నాడు.