Harsh Roshan Tella Kagitham first look
‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ లాంటి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న హర్ష్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’. నక్షత్ర హీరోయిన్గా నటిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి నందు సవిరిగన కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. లోతైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథను ఆయన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమకథా చిత్రాలకు కొత్తదనాన్ని జోడిస్తూ ప్రేక్షకులకు ఓ విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చిత్రబృందం తెలిపింది.
Harsh Roshan Tella Kagitham first look
అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం విడుదలైన ఈ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పరిశీలిస్తే, ఇది ఒక అందమైన యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్టు స్పష్టమవుతోంది. హీరో, హీరోయిన్ హర్ష్ రోషన్, నక్షత్రల మధ్య ప్రేమను ప్రతిబింబించే విజువల్స్‌తో పాటు పోస్టర్లో కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు ప్రధానంగా సాగే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ సంకేతాలు ఇచ్చారు.
సాంకేతికంగా కూడా ‘తెల్ల కాగితం’ బలమైన టీమ్‌తో రూపొందుతోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
అద్భుతమైన తారాగణం, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల కలయికలో తెరకెక్కుతున్న ‘తెల్ల కాగితం’ అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలో మరిన్ని విశేషాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.