Raj Tarun launch Pellaindi Kani NO Kahani Poster
యువ హీరో శ్రీహరి లీడ్ రోల్లో నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “పెళ్ళైంది కాని NO కహాని”. స్మిత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మై3 సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Raj Tarun launch Pellaindi Kani NO Kahani Poster
తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను హీరో రాజ్ తరుణ్ లాంచ్ చేసి హీరో శ్రీహరితో సహా టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ అందించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో శ్రీహరి మాట్లాడుతూ, “మా సినిమా పోస్టర్ లాంచ్‌కు విచ్చేసిన రాజ్ తరుణ్ గారికి, పద్మనాభరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ‘పెళ్ళైంది కాని NO కహాని’ పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. మరో నెలన్నరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆద్యంతం నవ్వులు పంచే ఎంటర్టైనర్గా ఈ చిత్రం నిలుస్తుంది” అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, “ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఏడుకొండలు ఈ చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, “ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. హీరో శ్రీహరి సహా చిత్ర బృందం అందరికీ నా శుభాకాంక్షలు” అన్నారు.
దర్శకుడు ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ, “సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సెన్సార్ పూర్తి చేసి వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నాం. తెలుగు వారికి సంక్రాంతి ఎంత సరదాగా ఉంటుందో, ఈ సినిమా కూడా అంతే వినోదాన్ని అందిస్తుంది. కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది” అని చెప్పారు.
నటుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, “బలమైన కథ, వినోదం ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. మా చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు థియేటర్ నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారని నమ్మకంగా చెబుతున్నాను” అన్నారు.
Raj Tarun launch Pellaindi Kani NO Kahani Poster
నటీనటులు:
శ్రీహరి, స్మిత, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, రెడ్డి, సత్యశ్రీ, శాంతికుమార్, జగన్మోహన్ రావు తదితరులు.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మై3 సినిమాస్
కథ, దర్శకత్వం: ఏడుకొండలు తాడిశెట్టి
సినిమాటోగ్రాఫర్ : ఆనంద్ మరుకుర్తి
సంగీతం: బాలు కె లయరాగ్
ఎడిటింగ్: శిరీష్ ప్రసాద్
వీఎఫ్ఎక్స్: టింట్ VFX
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : సోమేశ్ యెరిపల్లి
కొరియోగ్రఫీ: నగేష్
స్టైలింగ్: హరిణి.వి
పీఆర్వో: మూర్తి మల్లాల – హర్ష