Karmany Selvam Streaming on Prime Video
మనిషి జీవితంలో డబ్బు ఎంత ప్రభావం చూపుతుందో, కుటుంబ సంబంధాలు ఎలా మారుతాయో, ప్రస్తుత మోడరన్ ఏరాలో మారుతున్న ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిన తెలుగు, తమిళ బైలింగ్విల్ చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటుడు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ ప్రధాన పాత్రల్లో రామ్ చక్రి దర్శకత్వంలో పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 3న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ట్రెమండెస్ రెస్పాన్స్ తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ..‘‘ఆర్థిక స్వేచ్ఛ కోసం మనశ్శాంతి, కుటుంబం, జీవితంలోని విలువైన క్షణాలను త్యాగం చేయడం సరైనదేనా? అనే ఆలోచనను ఈ ‘కార్మేని సెల్వం’
చిత్రం అందిస్తుంది. ఈ కథ ప్రతి ఇంటికి చేరాలని మేము ఎప్పటి నుంచో కోరుకున్నాం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఎమోషనల్ రైడ్ ఫ్యామిలీ ఆడియెన్స్ మనసును తాకేలా ఉంటుందని నిర్మాతలు అన్నారు.
Karmany Selvam Streaming on Prime Video
కథ విషయానికొస్తే..
సెల్వం అనే డ్రైవర్ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభమే ఈ కథా నేపథ్యం. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, పెరుగుతున్న అప్పుల నుంచి బయటపడేందుకు అతను తన యజమాని కారును రహస్యంగా టాక్సీ సర్వీస్ కోసం ఉపయోగించడం ప్రారంభిస్తాడు. మొదట చిన్న నిర్ణయంలా కనిపించిన ఈ చర్య క్రమంగా అతని జీవితాన్ని సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతుంది. డబ్బు కోసం సాగిన ఆ ప్రయాణం చివరికి అతనికి ఒక కీలక ప్రశ్నగా ఎదురవుతుంది. మనశ్శాంతి, కుటుంబం, సమయాన్ని కోల్పోయి సంపాదించే ఆర్థిక స్వేచ్ఛ నిజంగా విలువైనదేనా అని అందర్నీ ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది.
ఈ సినిమా కుటుంబం, డబ్బు, ఆధునిక జీవన శైలి మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణలను ప్రతిబింబిస్తుంది. మిడిల్ క్లాస్ భర్తగా, తండ్రిగా సముద్రఖని నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వారి నటన చిత్రానికి మరింత బలం చేకూర్చనుంది. ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు భావోద్వేగంతో కూడిన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చిత్రం రూపొందింది.
ఈ సినిమా విజయంలో సాంకేతిక బృందం కూడా కీలక పాత్ర పోషించింది. యువరాజ్ దక్షన్ అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి సహజత్వాన్ని తీసుకురాగా, జగన్ ఆర్వీ, దినేష్ ఎస్ ఎడిటింగ్ కథనాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దింది. మ్యూజిక్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ అందించిన సంగీ తం, రాఘవ్ రమేష్, హరి ప్రసాద్ ఎంఏ రూపొందించిన సౌండ్ డిజైన్ చిత్ర భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తాయి. ప్రొడక్షన్ డిజైనర్ శంకర్, లిరిసిస్టులు మణి అముతవన్, ఉమా దేవి కూడా తమ పనితో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణను జోడించారు.
థియేటర్లలో మంచి స్పందన దక్కించుకున్న ‘కార్మేనీ సెల్వం’ జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుండగా, ఓటీటీ ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ దక్కుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Karmany Selvam Streaming on Prime Video
చిత్రం : కార్మేనీ సెల్వం
ఓటీటీ స్ట్రీమింగ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
స్ట్రీమింగ్ డేట్ : జూన్ 3 నుంచి..
నటీనటులు:
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు.
సాంకేతిక బృందం:
బ్యానర్: పాత్వే ప్రొడక్షన్స్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
కథ – దర్శకత్వం: రామ్ చక్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
మ్యూజిక్: MAAS (Music as a Service), Musicloud Studio & Technology
డీఓపీ: యువరాజ్ దక్షన్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
ఆడియోగ్రఫీ: రాఘవ్ రమేష్
సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ – హరి ప్రసాద్ MA
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్
మార్కెటింగ్: నాని కాంచనపల్లి – జయరాజ్ గేదెల
పిఆర్ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్)