Anupama Regina Marichika… Movie Review
రివ్యూ : మరీచిక
నటీనటులు : అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు..
దర్శకత్వం : సతీష్ కాసెట్టి
రచయిత : లక్ష్మీ భూపాల
బ్యానర్ : చిలకా ప్రొడక్షన్స్
నిర్మాత : రాజీవ్ చిలకా, మేఘా చిలకా
సినిమాటోగ్రఫీ : అరవింద్ కన్నబిరాన్
ఎడిటర్ : జునైద్ సిద్ధికీ
మ్యూజిక్ : ఇళయరాజా
విడుదల తేదీ : 29/05/2026
నిడివి : 2 గంటల 18 నిమిషాలు
Anupama Regina Marichika… Movie Review
అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా ‘హోప్’, ‘టెర్రర్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సతీష్ కాసెట్టి రూపొందించిన చిత్రం ‘మరీచిక’. ఇళయరాజా సంగీతం, లక్ష్మీ భూపాల కథ, మాటలు అందించిన చిత్రం శుక్రవారం విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
ఒకవైపు ప్రేమలో ఓడిపోయిన అమ్మాయి.. మరోవైపు తన గతాన్ని దాచుకున్న ఓ మహిళ.. ఈ ఇద్దరి మధ్య చిక్కుకున్న యువకుడి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కాలేజ్ స్టూడెంట్ వెంకటలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) తన ప్రేమను మనసులోనే దాచుకుంటూ సంజు (విరాజ్ అశ్విన్) కోసం జీవిస్తుంటుంది. అలాంటి సమయంలో విదేశాల నుంచి వచ్చిన మరీచిక (రెజీనా కసాండ్రా) వాళ్ల జీవితాల్లోకి అడుగుపెడుతుంది. తర్వాత సంజు, మరీచికలు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. కానీ ఒక్కసారిగా సంజుని మరీచిక చంపేసిందంటూ వెంకటలక్ష్మి పోలీసులను ఆశ్రయించడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. అసలు మరీచిక నిజంగానే ఉందా? లేక వెంకటలక్ష్మి ఊహాలోకంలో పుట్టిన పాత్రేనా? ప్రేమ, మోసం, మానసిక సంఘర్షణల నడుమ సాగే ఈ ప్రశ్నలకే ‘మరీచిక’ సమాధానం.
ఎవరెలా చేశారంటే ..
అనుపమ పరమేశ్వరన్.. వెంకటలక్ష్మి పాత్రలో పళ్లకి క్లిప్పులు, కంటికి పెద్ద కళ్లజోడుతో డీ గ్లామర్‌గా ఎమోషనల్‌గా నటించేందుకు ప్రయత్నించినా.. పాత్రలో బలం లేకపోవడంతో ఆమె నటన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. లండన్ నుంచి తిరిగి వచ్చిన మరీచిక క్యారెక్టర్లో రెజీనా కసాండ్రా కనిపిస్తుంది. ఆమె పాత్ర మిస్టీరియస్‌గా ఉండాల్సింది పోయి, పేలవంగా అనిపిస్తుంది. ఇంగ్గీష్ మాట్లాడుతుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అందంగా ఉన్నా, క్యారెక్టర్ కనెక్ట్ అవదు. విరాజ్ అశ్విన్ పాత్ర పూర్తిగా ఫ్లాట్‌గా సాగిపోయింది. హీరోగా అవసరమైన ఇంపాక్ట్ ఎక్కడా కనిపించదు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిమితుల్లోనే కనిపించారు తప్ప గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఏదీ లేదు.
టెక్నికల్ విషయానికొస్తే..
ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావించినా.. ఆయన స్థాయికి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వినిపించలేదు. కొన్ని చోట్ల సంగీతం సన్నివేశాలకంటే ఎక్కువ డ్రామాటిక్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించినా, థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేసే విజువల్ ట్రీట్ మాత్రం లేదు. సినిమా మొత్తం ఒక ఫ్లాట్, ఒక కేఫ్‌లోనే తీసినట్టు తెలుస్తోంది. ఎడిటింగ్ చాలా వీక్. అవసరం లేని సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సినిమా మరింత లాగ్ అయింది. దర్శకుడు సతీశ్ కాసెట్టి కథను ఆసక్తికరంగా ప్రారంభించినా, దాన్ని చివరి వరకు పట్టుదలగా నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. లక్ష్మీ భూపాల్ రాసిన కథ, మాటలు కూడా ఎక్కడా బలమైన ప్రభావం చూపించలేదు.
Anupama Regina Marichika… Movie Review
సినిమా ఎలా ఉందంటే..
మిస్టరీ థ్రిల్లర్ అనే ట్యాగ్‌తో వచ్చిన ‘మరీచిక’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించినా.. తెరపై మాత్రం పూర్తిగా నిరాశపరుస్తుంది. కథలో ఉన్న కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా, దాన్ని తెరపై చూపించిన తీరు మాత్రం గందరగోళంగా మారింది. మొదటి అరగంట నుంచే సినిమా ఏ దిశగా వెళ్తుందో అర్థంకాక ప్రేక్షకుడు కన్ఫ్యూజన్లో పడిపోతాడు. థ్రిల్లర్ సినిమాకు అవసరమైన టెన్షన్, ఎమోషన్, సస్పెన్స్ ఏ ఒక్కటి కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్. ట్విస్టుల పేరుతో చూపించిన సన్నివేశాలు కూడా ఎక్కడా ప్రభావం చూపించవు. క్లైమాక్స్‌కు వచ్చే సరికి సినిమా మీద ఉన్న ఆసక్తి పూర్తిగా చచ్చిపోతుంది. షార్ట్ ఫిల్మ్, డాక్యూమెంటరీ తరహాలో సాగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా అనిపిస్తుంది. మొత్తానికి ఇదొక కన్ఫ్యూజన్ డ్రామాగా నిలుస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కథలో ఉన్న మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్
రెజీనా, అనుపమ స్క్రీన్ ప్రెజెన్స్
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే
కన్ఫ్యూజింగ్ నేరేషన్
ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడం
ఇంపాక్ట్ లేని ట్విస్టులు
బలహీనమైన పాత్రల రచన
థ్రిల్లర్‌కు అవసరమైన టెన్షన్ లేకపోవడం
క్లైమాక్స్ నిరాశపరచడం
Anupama Regina Marichika… Movie Review
ఫైనల్‌గా : మరీచికను ఆడియెన్స్ మరిచిపోవడమే బెటర్.
రేటింగ్ : 1.5/5