Arjun Blast Zone Movie Review
రివ్యూ : బ్లాస్ట్ జోన్.. కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్
నటీనటులు : అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్, అర్జున్ చిదంబరం, జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న, పవన్ కృష్ణ, దిలీపన్, బాల హాసన్, వినోద్ సాగర్ తదితరులు
దర్శకత్వం : సుభాష్ కె రాజ్
బ్యానర్ : ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : కల్పాజి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్
సినిమాటోగ్రఫీ : అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటర్ : ప్రదీప్ ఈ రాఘవ్
మ్యూజిక్ – : రవి బస్రూర్
విడుదల తేదీ : 28-/05/2026
నిడివి : 2 గంటల 24 నిమిషాలు
Arjun Blast Zone Movie Review
యాక్షన్ కింగ్‌గా పేరొందిన అర్జున్.. చాలా రోజుల తర్వాత నటించిన యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ‘బ్లాస్ట్ జోన్’. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి? వంటి అంశాలతో ఫ్యామిలీ విత్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
రాజా రామన్ (అర్జున్ సర్జా) ఒక ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. తన భార్య నీలవేణి (అభిరామి)తో కలిసి కరాటే అకాడమీ నడుపుతూ ఉంటాడు. వీరిద్దరూ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్స్. తమ కుమార్తె నీల (ప్రీతి ముకుందన్)ను కూడా చిన్నప్పటి నుంచే ధైర్యంగా పెంచుతారు. నీల ఉద్యోగం చేసుకుంటూనే, ఓ వైపు తండ్రికి, మరోవైపు తన బాబాయ్‌కి ఉన్న మెడికల్ షాప్‌ను చూస్తుంటుంది. రాజా రామ్ తన కూతురికి ఎప్పుడూ “అన్యాయం కనిపిస్తే మౌనంగా ఉండొద్దు” అని నేర్పిస్తాడు. ఆ ప్రభావంతో నీల ఎక్కడ తప్పు జరిగినా ఎదిరించే స్వభావం పెంచుకుంటుంది. అలా రోజుకో గొడవ ఇంటి మీదికి తీసుకొస్తుంది. ఆమె తల్లి మాత్రం ఈ గొడవలు ఆపి పెళ్లి చేయాలని చూస్తుంటుంది. కానీ అనుకోకుండా ఓ పెద్ద సమస్యలో వీరి కుటుంబం ఇరుక్కుంటుంది. దీంతో విలన్స్ గ్యాంగ్ వారి కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తుంది. ఈ సమస్య నుంచి అర్జున్ కుటుంబం ఎలా బయటపడింది, దీని వెనుక ఎవరున్నారు అనేది యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగిందీ కథ.
ఎవరెలా చేశారంటే ..
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అర్జున్ చేసిన యాక్షన్ మూవీ ఇది. మిడిల్ క్లాస్ తండ్రిగా కనిపిస్తూనే, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతదూరమైనా వెళ్లే పాత్రలో అర్జున్ నటించిన తీరు ఆకట్టుకుంది. ఎక్కడా హీరోయిజం ప్రదర్శించకుండా భార్య, కూతురికి సరిసమానంగా యాక్షన్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఫ్యామిలీ రోల్స్‌లో మెప్పించిన అభిరామి ఇలాంటి కొత్త తరహా క్యారెక్టర్ చేయడం ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుని మరీ యాక్షన్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. అలాగే ‘కన్నప్ప’ సినిమాలో గ్లామర్ హీరోయిన్గా కనిపించిన ప్రీతి ముకుందన్ ఈ చిత్రంలో మాత్రం యాక్షన్ హీరోయిన్గా అదరగొట్టింది. ఈ ముగ్గురి యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు కన్నులపండువగా ఉంటాయి. వివేక్ పాత్రలోని ట్విస్ట్ కూడా సర్ప్రైజ్ చేస్తుంది. వరుణ్‌గా జాన్ కొక్కేన్, అబ్రహాంగా అర్జున్ చిదంబరం, కిరుబకరన్‌గా పవన్ కృష్ణ వంటి వారు పాత్రల పరిధి మేరకు మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
టెక్నికల్ విషయానికొస్తే..
ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. ఒక్క పాట లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో సీన్స్‌ను మరింత ఎలివేట్ చేశారు. అరుణ్ రాధాకృష్ణన్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ పరంగా కొంత ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు సుభాష్ కె రాజ్ రెగ్యులర్ స్టోరీని తనదైన స్టయిల్లో, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా మలిచి తెరకెక్కించడం విశేషం.
Arjun Blast Zone Movie Review
సినిమా ఎలా ఉందంటే..
ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా మొదలైనా, మెడికల్ షాప్ ఎపిసోడ్ తర్వాత కథ పుంజుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ హైలైట్‌గా నిలుస్తుంది. సెకండాఫ్‌లో ఉత్కంఠ, ట్విస్టులు, యాక్షన్ ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో ఫ్యామిలీ వర్సెస్ విలన్స్ ట్రాక్ ఆసక్తికరంగా సాగింది. స్క్రీన్‌ప్లే ప్రధాన బలం అని చెప్పొచ్చు. మధ్యలో విక్రమ్, దృశ్యం సినిమాలు గుర్తొస్తాయి. ఎమోషనల్ కనెక్ట్ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కథ కంటే స్క్రీన్‌ప్లే, యాక్షన్ సెటప్‌లపై ఆధారపడిన సినిమాగా చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ పవర్ఫుల్ యాక్షన్ ప్రెజెన్స్
స్టైలిష్ స్క్రీన్‌ప్లే, ట్విస్టులు
ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్స్
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ ప్రారంభం
లాజిక్కు దూరమైన కొన్ని ఎపిసోడ్స్
ఎమోషనల్ కనెక్ట్ తక్కువగా ఉండటం
Arjun Blast Zone Movie Review
ఫైనల్‌గా : మాస్ యాక్షన్, ట్విస్టులు, టెన్షన్‌తో ఎంగేజ్ చేసే థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి బాగా నచ్చే అవకాశం ఉంది. అయితే బలమైన ఎమోషన్స్ లేదా పూర్తి రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఆశిస్తే కొంత నిరాశ కలిగించవచ్చు.
రేటింగ్ : 2.5/5