Jagapathi Interview About Peddi
‘పెద్ది’ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని, ఈ సినిమాతో టాలీవుడ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుందని వెర్సటైల్ స్టార్ జగపతి బాబు అన్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌లోని ఒక్కొక్కరు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. బుధవారం జగపతిబాబు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..
Jagapathi Interview About Peddi
- రామ్ చరణ్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఆయన నటించిన ఈ మోస్ట్ ప్రెస్టేజీయస్ చిత్రంలో నాకు ఈ పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.
- ఈ చిత్రంలో అప్పలసూరి పాత్రలో పవర్ఫుల్ రోల్లో కనిపిస్తాను. డైరెక్టర్ బుచ్చిబాబు నా పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌తో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి లుక్ ని డిజైన్ చేశారు. మొదటిసారి ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. గెటప్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఈ సినిమా మొత్తం జగపతి బాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. లెజెండ్ తర్వాత చాలా సినిమాలు చేశాను. కానీ వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు వుంటాయి. ఆ జాబితాలో ‘పెద్ది’లో చేసిన అప్పలసూరి నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. -పాత్ర ఎంతసేపు ఉంటుంది అనేది ముఖ్యం కాదు. ఉన్నంతసేపు ఎంత ప్రభావం చూపిస్తుంది అనేదే ముఖ్యం. అప్పలసూరి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది.
- ఈ సినిమా కోసం ప్రోస్థెటిక్ మేకప్ వేశారు. ఈ మేకప్‌లో చాలానే సవాళ్లు ఉంటాయి. చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి. వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చేది. ప్రతిరోజూ మేకప్‌కు దాదాపు మూడు గంటల సమయం పట్టేది. అయినా ఈ పాత్ర కోసం చేసిన శ్రమ మొత్తం విలువైనదిగా అనిపించింది.
- ఈ చిత్రంలో అందరు అనుకున్నట్టు నాది తండ్రి పాత్ర కాదు. చాలా ప్రేమతో, అనుబంధంతో కూడిన పాత్ర చేశాను. నాకు, రామ్ చరణ్ పాత్రకు మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం కూడా ఒక ఛాలెంజ్. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఆ పాత్రలో మ్యాజిక్ ఉంది. ఆ యాసలో కూడా మ్యాజిక్ ఉంది. అలాంటి పాత్ర దొరికినప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆ పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఇంకెవ్వరూ కనిపించకూడదు అనేది నా ప్రయత్నం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ‘పెద్ది’ మరో ఎత్తు.
- ఆర్టిస్ట్‌గా నాకు కిక్ ఇచ్చే దర్శకులు ఒకరు సుకుమార్, మరొకరు బుచ్చిబాబు. ఈ సినిమాతో నాపై చాలా పని పెట్టారు. ‘పుష్ప’ డబ్బింగ్ సమయంలో నేను కూర్చొని డబ్బింగ్ చెబుతున్నాను. అప్పుడు సుకుమార్ గారికి ఒక వాయిస్ మెసేజ్ పంపాను. ఎలా అర్థమైందో తెలియదు కానీ, “సార్… నిలబడి డబ్బింగ్ చెప్పండి” అన్నారు. -నిజంగా ఆయనకు ఎలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కాదు. డబ్బింగ్ థియేటర్లో నడవడం కుదరదు. కానీ చివరకు ఒక మైక్ తీసుకొచ్చి నేను నడుస్తూ ఉండగా రికార్డ్ చేశారు. అక్కడ ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. డబ్బింగ్లో కూడా మనం పాత్రలో జీవించాలి. బుచ్చిబాబు, సుకుమార్ ఇద్దరూ పూర్తి క్లారిటీతో ఉంటారు. దర్శకుడికి క్లారిటీ ఉంటే నటుడి పని చాలా సులభమవుతుంది.
- ‘రంగస్థలం’ తర్వాత మళ్లీ రామ్ చరణ్‌తో వర్క్ చేయడం వెరీ హ్యాపీ. ఆయన పలకరింపులోనే ఒక ఆప్యాయత ఉంటుంది. వ్యక్తిగా చాలా మంచివాడు. మా కుటుంబం మొత్తం చరణ్ ని ఇష్టపడతారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చూసి ఆశ్చర్యపోయాను. దెబ్బలు తిన్నారు, రక్తం కారింది. ఎక్కడా డూప్ ఉపయోగించకుండా స్వయంగా చేశారు. ‘రంగస్థలం’ నుంచి చరణ్ నటుడిగా నిరంతరం ఎదుగుతూనే ఉన్నారు. ప్రతి సినిమాకు మరింత అందంగా కనిపిస్తున్నారు. ఆయనకు అలాంటి మంచి పాత్రలు వస్తున్నాయి.
- నిర్మాత సతీష్ గారు అదృష్టవంతుడు. రామ్ చరణ్ ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని ఈ సినిమా ఆయనకు చేశారు. అక్కడే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. సతీష్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ప్రేమతో పనిచేశారు. ఇక ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన ప్రతి పాట ఒకదానికంటే మరొకటి పెద్ద హిట్ అయ్యింది. అక్కడే సినిమా సగం సక్సెస్ అయినట్టే.
- పెద్ది ఈరోజు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లాంటి సినిమా. గట్టిగా ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఒక నటుడుగా నేను కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. మంచి క్యారెక్టర్ దొరికింది అనే సంతోషం ఉంది.
Jagapathi Interview About Peddi
ఇక నేను ప్రస్తుతం సోనీ లివ్ కోసం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే భారీ వెబ్ సిరీస్ చేస్తున్నాను. చాలా పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్ అది.