Sunil at the Catalan Pre-release Event
పుష్ప తర్వాత నా కెరీర్ కొత్త మలుపు తిరిగింది : సునీల్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’. బ్లాక్‌బస్టర్ ‘మార్కో’ మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఆంటోనీ వర్గీస్ హీరోగా నటించగా, దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, సునీల్, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, పాటలతో మంచి హైప్ సొంతం చేసుకుంది. మే 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
Sunil at the Catalan Pre-release Event
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “పుష్ప తర్వాత నా కెరీర్ పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు ఏ భాష నుంచి, ఎలాంటి పాత్ర వస్తుందో ముందుగా ఊహించలేకపోతున్నాను” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో తాను పోషించిన ‘మారి’ పాత్ర తన కెరీర్లోనే విభిన్నమైనదని సునీల్ చెప్పారు. “ఇలాంటి పాత్రను నేను ఇప్పటివరకు చేయలేదు. చాలా వెర్సటైల్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ అవకాశం రావడం పుష్ప వల్లే అనిపిస్తోంది” అని చెప్పారు. దర్శకుడు పాల్ జార్జ్ కథ చెప్పినప్పుడే సినిమా ప్రత్యేకత అర్థమైందని, పాత్ర కోసం ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. ఇది యూనివర్సల్‌గా ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్ అయ్యే సినిమా అని, అద్భుతమైన యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని, థియేటర్లలో గ్రాండ్ అనుభూతిని ఇస్తుందని అన్నారు.
ఇక ఈవెంట్లో మాట్లాడిన ఆజాద్, “మార్కో తర్వాత మరో హై ఎనర్జీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. నటీనటుల పెర్ఫార్మెన్స్లు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అని అన్నారు.
నటుడు కబీర్ దుహాన్ సింగ్ మాట్లాడుతూ “కాటాలన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే హార్డ్‌కోర్ యాక్షన్ మూవీ. దాదాపు 110 రోజుల పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం” అని తెలిపారు. సునీల్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించిందని చెప్పారు.
నటుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ “ఇది హై-వోల్టేజ్ రా యాక్షన్ ఎమోషనల్ మూవీ. ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియన్ 100 శాతం కృషి చేశారు” అని అన్నారు.
మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘కాటాలన్’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ యాక్షన్, బలమైన భావోద్వేగాలు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనున్నట్లు మూవీ టీమ్ తెలియజేసింది.