Pradeep as Producer and Mamitha Baiju in the Lead Role
ప్రదీప్ నిర్మాతగా.. మమితబైజు లీడ్‌గా కొత్త ప్రాజెక్ట్
తమిళ సినీ పరిశ్రమలో మరో క్రేజీ కాంబినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగానూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ మమితబైజు ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుపై కోలీవుడ్‌లో ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. గతేడాది ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా ‘డ్యూడ్’ సినిమాలో నటించగా, వీరి జోడీకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి వీరి కాంబోలో మూవీ అనగానే హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే లవ్, కామెడీ ఎంటర్టైనర్లతో ప్రదీప్‌కు మంచి గుర్తింపు ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా మంచి బజ్ ఏర్పడుతోంది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు గతంలో ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ లాంటి చిత్రాలతో హిట్స్ అందుకోవడంతో ఈ చిత్రంలోనూ తనదైన ఎమోషన్‌తోపాటు ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రదీప్ నిర్మాణంలో రాబోయే ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఉండే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కథ, ఇతర నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వంటి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.