Action King Arjun Blast Zone Release on May 28
యాక్షన్ కింగ్ అర్జున్, ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్ జోన్’. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ‘కేజీఎఫ్’ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మే 28న సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
Action King Arjun Blast Zone Release on May 28
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో అర్జున్ మాట్లాడుతూ ‘‘నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా ఇది. సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని సందేశం ఇచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించే అంశాలను కమర్షియల్ యాక్షన్‌తో ఎలిమెంట్స్‌తో రూపొందించాం. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రీతి ముకుందన్, అభిరామి మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుని నాకంటే అద్భుతంగా ఫైట్స్ చేశారు. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి” అని అన్నారు. నటి అభిరామి మాట్లాడుతూ.. ఇది తన కెరీర్లో పూర్తి భిన్నమైన పాత్ర అని తెలిపారు. ఇప్పటివరకు చేయని మాస్ యాక్షన్ రోల్లో కనిపించనున్నానని, ఈ పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నానని చెప్పారు. షూటింగ్ సమయంలో గాయాలు అయినా, ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డామని అన్నారు. ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ.. ట్రైలర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. మే 28న విడుదల కానున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు సుభాష్ కె రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ప్రేక్షకులు వింటేజ్ అర్జున్ను చూస్తారని అన్నారు. యాక్షన్, ఎమోషన్, మహిళా సాధికారత అంశాలు కలగలిపిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘బ్లాస్ట్ జోన్’ రూపొందిందని తెలిపారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని, ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పాత్తి మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అందిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులపై కలిసి పని చేయాలని ఆకాంక్షించారు.