విశ్వక్‌సేన్ హీరోగా కొత్త చిత్రం షురూ

విశ్వ‌క్‌సేన్ హీరోగా.. స‌మ‌ర్ప‌కుడిగా యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ ప్రొడ‌క్ష‌న్ నెం.3 స్టార్ట్‌ .. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క్లాప్‌..పూజా కార్య‌క్ర‌మాల‌తో మూవీ గ్రాండ్ లాంచ్‌

ఎన్టీఆర్‌ దేవ‌ర‌తో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ మ‌రో భారీ సినిమాను రూపొందించ‌టానికి సిద్ధ‌మైంది. మాస్ కా దాస్‌గా అంద‌రూ పిలుచుకునే విశ్వ‌క్ సేన్ హీరోగా నిర్మాత సుధాక‌ర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు.  ప్ర‌స్తుతానికి యువ సుధ ఆర్ట్స్  ప్రొడ‌క్ష‌న్ నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మ‌రింత హైప్ పెరిగింది. తాజాగా ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను సోమ‌వారం రోజున‌ ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ వేడుకకు ప‌లువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి, స్క్రిప్ట్‌ను అందించారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు ర‌జ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అర‌వింద్ విశ్వ‌నాథ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, తేజ‌స్ కృష్ణ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్స్ భాను భోగ‌వ‌ర‌పు, నందు స‌విర‌గాన డైలాగ్స్ రాస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియ‌జేస్తామ‌ని మేకర్స్ తెలియ‌జేశారు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని