VijayDevarakonda Rashmika Latest Photos
స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక దేవరకొండ తమ మంచి మనసును చాటుకున్నారు. విజయ్ తండ్రి స్వస్థలం అయిన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ 2026’ కార్యక్రమంలో 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన 180 మంది విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్, రష్మిక విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి ప్రోత్సాహకరమైన మాటలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఈ స్టార్ కపుల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు వీరి సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఫొటోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ – రష్మిక దేవరకొండ లేటెస్ట్ ఫొటో గ్యాలరీపై ఓ లుక్కేయండి..!
VijayDevarakonda Rashmika Latest Photos









