50 కుటుంబాల ఆశలు ఈ సినిమాపై ఉన్నాయి : కిరణ్ అబ్బవరం

‘చిన్న చిత్రాల్లో “తిమ్మరాజుపల్లి టీవీ” బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నిర్మాతగా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సుమైర స్టూడియోస్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంతో
సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘ చిన్న బడ్జెట్ లో టెక్నికల్ గా ఇంత క్వాలిటీగా, ఇంత బ్రిలియంట్ గా మూవీ చేయోచ్చా అని ఆశ్చర్యపోతారు. చిన్న చిత్రాల్లో ఇది కచ్చితంగా బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. తిమ్మరాజుపల్లి అనే ఊరిలో జరిగిన ఘటనల నేపథ్యంగా ఇంత థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా సినిమా రూపొందించవచ్చా అని మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది. ఇండస్ట్రీలోని వారిని నా సినిమాలకు సపోర్ట్ చేయమని ఎప్పుడూ అడగలేదు.కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేయమని కోరుతున్నా.ఎందుకంటే కనీసం యాభై కుటుంబాల ఆశలు ఈ సినిమా మీద ఉన్నాయి. నాకు వీలైనంత సపోర్ట్ వారికి నేను చేశాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే కొత్తవాళ్లకు మరింత హోప్స్ ఇచ్చినట్లు ఉంటుంది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన డబ్బులు రావాలి, నా పెట్టుబడి రాకున్నా ఫర్వాలేదు. ఈ కొత్త వాళ్ల లైఫ్స్ సెట్ కావాలి. నేను కోరుకునేది అదే. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం గొప్పగా భావించడం లేదు. మనం చేయాల్సిన బాధ్యతగా ఫీలవుతున్నా. ఊర్లల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కలలుకనే వారికి చెబుతున్నా మీరు ధైర్యంగా అనుకోండి ఏది అనుకుంటే అది అవుతారు. ఎవరూ నిరుత్సాహపడకండి. నాకు ఏ గుర్తింపు లేనప్పటి నుంచే నన్ను నమ్మింది రహస్య. నా సక్సెస్ కు ఆమె కారణం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే ఫేర్ వెల్ ఫీలింగ్ కలుగుతోంది. మా చిన్న చిత్రానికి ఇండియాలో పెద్ద స్క్రీన్ మీద ప్రీమియర్ వేస్తున్నాం.మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. సినిమాను ప్రేమించే తెలుగు ప్రేక్షకులే మా తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను సపోర్ట్ చేయాలి. మా సినిమాను తమిళ, మలయాళం వాళ్లు రిలీజ్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ తో సినిమాకు వెళ్లండి. మంచి సమ్మర్ వెకేషన్ కు వెళ్లినట్లు ఉంటుంది.సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఇది నా ప్రామిస్”అని అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ -‘‘ఆన్ లైన్ ఎడిటింగ్ చేసే నాకు హీరోగా అవకాశం ఇచ్చారు కిరణ్ గారు. అలాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను హీరో అనే కంటే కిరణ్ అబ్బవరం తమ్ముడు అని ఎవరైనా పిలిస్తేనే సంతోషంగా ఉంటుంది. ఇంతమందికి అవకాశం కల్పించాలని కిరణ్ గారు మంచి మనసుతో చేసిన ప్రయత్నాన్ని సక్సెస్ చేసేందుకు మీరంతా ఈ నెల 17న థియేటర్స్ కు వెళ్లి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూడండి’’ అని అన్నారు. హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ ‘‘- నాతో పాటు మరో 60 మంది కొత్త వాళ్లకు ఈ సినిమా అవకాశం కల్పించింది. అలా మొదటి మెట్టు ఎక్కే అవకాశం మా కిరణ్ గారు కల్పించారు. ఒక అవకాశం కోసం వెయిట్ చేసేవారికి ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పలేను. ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన కిరణ్ గారికి మాత్రమే మాలాంటి వారి ఎమోషన్ అర్థమవుతుంది. ఒక అమ్మాయిగా చెబుతున్నా కేఏ ప్రొడక్షన్స్ పక్కా ప్రొఫెషనల్ బ్యానర్. ఈతరం ప్రేక్షకులు తప్పకుండా మా మూవీ చూడాలి.మా సినిమాలో ఫారిన్ సాంగ్స్ లేవు, భారీ యాక్షన్ సీక్వెన్సులు లేవు కానీ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీతో పాటే మా మూవీ వస్తుంది. మీ అందరికీ అందమైన జ్ఞాపకంలా మా సినిమా మిగిలిపోతుంది” అని చెప్పారు. డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ – నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు,చెల్లికి ఏమీ కొనివ్వలేదు.ఈ నెల 17న తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అయ్యాక మీరంతా గర్వపడేలా చేస్తాను.మనకు ఎంత ప్రతిభ ఉన్నా, అవకాశం ఇచ్చేవాళ్లే గొప్ప. మీటర్ సినిమా టైమ్ లో కిరణ్ గారిని కలిశాను. ఆయన ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్ గా ప్రమోట్ చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నాను. కేఏ ప్రొడక్షన్స్ నాకు ఫ్యామిలీ లాంటిది. ఈ సంస్థను వదులుకోను. రహస్యగారు మమ్మల్మి తల్లిలా చూసుకుంటారు. ఈ నెల 17న మా సినిమా చూడండి. గ్యారెంటీగా మీకు నచ్చుతుంది. సక్సెస్ మీట్ లో తప్పకుండా కలుద్దాం” అని అన్నారు. నటులు తేజ విహాన్, బాలరాజు, సాయికృష్ణ, అనిల్, లతీష్, కాస్ట్యూమ్ డిజైనర్ విశాల్య, లిరిసిస్ట్ సనరే, డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల,క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ తదితరులు పాల్గొన్నారు.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని