హైదరా‘బాద్షా’.. అభి‘షేర్’ శర్మ.. ఆయా షేర్ ..
ఉప్పల్ స్టేడియంలో వరుసగా మూడో విజయం
ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
ఐపీఎల్ 2026 లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 242 పరుగుల భారీ టార్గెట్‌ను ఢిల్లీ ముందుంచింది. ఇందులో ఆరెంజ్ ఆర్మీ ఓ రేంజ్లో ఢిల్లీని ఉతికిపారేసింది. ముఖ్యంగా అభిషేర్ శర్మ.. ఆయా షేర్ అన్నట్టుగా ఉతికిపారేశాడు. 68 బంతుత్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు కొట్టి అజేయంగా నిలిచాడు. గేమ్ స్టార్ట్ అయినప్పట్నుంచీ ఢిల్లీ బౌలర్లను ఉతికేశాడు. ఇక 243 పరుగుల భారీ టార్గెట్‌తో క్రీజులో దిగిన ఢిల్లీ ఆటగాళ్లను మొదటినుంచి అదుపుచేసుకొచ్చారు సన్‌రైజర్స్ బౌలర్లు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేశారు. ఇందులో ఇషాన్ మలింగ నాలుగు వికెట్లు తీశాడు. దీంతో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీని అందుకున్నారు.
ఉప్పల్ స్టేడియంలో వరుసగా మూడో విజయం అందుకోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 3కి వెళ్లింది సన్ రైజర్స్ హైదరాబాద్.






