పాపం ప్రతాప్ ప్రమోషన్ కష్టాలు

సినిమాకు ప్రమోషన్ చేసే బడ్జెట్‌తో మరో మూవీ కంప్లీట్ చేయొచ్చని అంటున్నారు యువ నటుడు తిరువీర్. తను హీరోగా ఎస్‌పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్ సమర్పణలో రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి కలిసి నిర్మించిన ‘పాపం ప్రతాప్’ చిత్రం ఏప్రిల్ 17న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో ఓ క్రేజీ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. తిరువీర్ అసిస్టెంట్ ఒకరు.. ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వగా, ట్రైలర్ అనౌన్స్‌మెంట్, ప్రీ అనౌన్స్‌మెంట్ కు ఓ వీడియో, టెక్నికల్ ఇష్యూ వలన ట్రైలర్ లేట్ అయ్యిందని చెప్పడం, చిన్న, పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్స్ తో హుక్ స్టెప్స్, ట్రైలర్ సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ ఇవ్వన్నీ చదువుతూ… ఇన్ని ప్రమోషన్స్ ఎందుకు అన్నట్టుగా ఫన్నీగా విడుదల చేసిన వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను చిత్రీకరించడానికి మేకర్స్ ఎంత కష్టపడుతున్నారో.. అంతకంటే ఎక్కువగా ప్రమోషన్స్ కోసం ఫోకస్ పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా రిలీజ్ కంటే తీయడమే ఈజీగా దర్శక నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. ఓ సినిమాను జనాలదగ్గరకు తీసుకెళ్లడానికి నానాతిప్పలు పడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తిరువీర్ ఈ వీడియో రిలీజ్ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఈ ప్రమోషనల్ వీడియో మరింత క్యూరియాసిటినీని క్రియేట్ చేసింది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని