Nayanthara’s Double Treat in August
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో జీవించి చూపించగల నటీమణుల్లో నయనతార ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, పాత్రకు ఎంత అవసరమో అంతగా తనను తాను మార్చుకునే అరుదైన నటి ఆమె. స్టైలిష్ బిజినెస్ ఉమెన్ అయినా, అమాయకమైన గ్రామీణ యువతి అయినా, యాక్షన్ పాత్రైనా, ఎమోషనల్ క్యారెక్టర్ అయినా.. ప్రతి పాత్రలో సహజంగా ఒదిగిపోవడం నయనతార ప్రత్యేకత. ఇప్పుడు అదే వైవిధ్యాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకే నెలలో, కేవలం రెండు వారాల వ్యవధిలోనే పూర్తిగా భిన్నమైన రెండు పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nayanthara’s Double Treat in August
ఆగస్టు 14న విడుదల కానున్న ‘హాయ్’ చిత్రంలో నయనతార చాలా సాధారణమైన, అమాయకమైన యువతిగా కనిపించనుంది. కవిన్ హీరోగా నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు విష్ణు ఎడవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ ప్రోమోలో వర్షంలో బస్ స్టాప్ వద్ద ఒక చేతిలో సంచి, మరో చేతిలో వేట కొడవలి పట్టుకుని చీరకట్టులో కనిపించిన నయనతార లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె కోసం బైక్‌పై వచ్చిన కవిన్, చేతిలో కొడవలి చూసి ఆశ్చర్యపోయే సన్నివేశం ఆసక్తిని పెంచింది. ఆ తర్వాత ఇద్దరూ వర్షంలో బైక్‌పై వెళ్లే విజువల్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.
Nayanthara’s Double Treat in August
ఇదే నెలలో ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానున్న యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’లో మాత్రం పూర్తిగా విభిన్నమైన అవతారంలో కనిపించబోతోంది నయనతార. ఈ సినిమాలో గంగ అనే కీలక పాత్రను పోషిస్తున్న ఆమె, ఆల్ట్రా మోడ్రన్ లుక్‌లో, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లలో ఆమె మేకోవర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఈ రెండు సినిమాలను పరిశీలిస్తే నయనతార నటిగా ఎంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుందో మరోసారి స్పష్టమవుతోంది. ఒకవైపు చీరకట్టులో అమాయకమైన మహిళగా, మరోవైపు హై-స్టైల్ మోడ్రన్ క్యారెక్టర్లో పూర్తిగా భిన్నమైన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో కనిపించడం ఆమెకే సాధ్యమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
నయనతార కెరీర్ మొత్తాన్ని పరిశీలించినా ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. ‘చంద్రముఖి’, ‘బిల్లా’, ‘జవాన్’ వంటి సినిమాల్లో ప్రతి పాత్రకు వేర్వేరు శైలిని ఎంచుకుని, ఒక్కో సినిమాలో ఒక్కో రూపంలో ప్రేక్షకులను మెప్పించింది. అందుకే ఆమెను అభిమానులు “లేడీ సూపర్ స్టార్”గా ఆదరిస్తున్నారు.
ప్రస్తుతం ‘హాయ్’, ‘టాక్సిక్’ సినిమాలతో మరోసారి తన నటన పరిధిని చాటేందుకు నయనతార సిద్ధమైంది. కేవలం రెండు వారాల వ్యవధిలో రెండు భిన్నమైన జానర్లలో, రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ప్రేక్షకులను పలకరించబోతున్న ఆమె.. ఈసారి కూడా తన నటనతో మరోసారి ఆకట్టుకోవడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.