Irumudi ₹200 Crore Club: Ravi Teja Career’s Biggest Blockbuster
రవితేజ కెరీర్లో తొలిసారి రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ‘ఇరుముడి’
ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్ద విజయం
‘ఇరుముడి’ సక్సెస్ ఒక మిరాకిల్ అన్న నిర్మాతలు
Irumudi ₹200 Crore Club: Ravi Teja Career’s Biggest Blockbuster
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తూ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ముఖ్యంగా రవితేజ కెరీర్లో తొలిసారి రూ.200 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ‘ఇరుముడి’ ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం నిర్వహించిన జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌తో పాటు చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని పంచుకుంది.
‘ఇరుముడి’ విజయం వెనుక ప్రధాన కారణం సినిమాలోని ఎమోషన్, రియలిస్టిక్ ట్రీట్మెంట్ అని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. మూడు విభిన్న లేయర్స్‌ను సమర్థవంతంగా కలపడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని చెప్పారు. ముఖ్యంగా ప్రతి కుటుంబం ఈ కథను తమ ఇంటి కథగా భావించిందని, ఒక ఆడపిల్ల, తల్లిదండ్రుల అనుబంధం నేపథ్యంలో వచ్చే భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకాయని పేర్కొన్నారు.
కథ రాస్తున్నప్పటి నుంచే కొన్ని అంశాలను చాలా ప్రభావవంతంగా, ప్రేక్షకులను కదిలించేలా చెప్పాలనే ఉద్దేశంతో పని చేశానని శివ నిర్వాణ అన్నారు. ఈ సినిమాలో రవితేజను పూర్తిగా కొత్త కోణంలో చూపించాలనుకున్నామని, త్రినాధ్ పాత్రలో ప్రేక్షకులు ఆయనను అద్భుతంగా ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేదని, కానీ ‘ఇరుముడి’ తర్వాత శివ నిర్వాణ ఎలాంటి జానర్లోనైనా సినిమా చేయగలడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడటం తనకు వచ్చిన గొప్ప కాంప్లిమెంట్ అని చెప్పారు.
ఈ సినిమా విజయంపై నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ.. విడుదలకు ముందు మంచి ఫలితం వస్తుందని భావించామని, కానీ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు పెద్ద విజయం సాధించిందని అన్నారు. ముఖ్యంగా సినిమా ఫుట్‌ఫాల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయని తెలిపారు. కేవలం నైజాం ప్రాంతంలోనే ఇప్పటివరకు సుమారు 42 లక్షల మంది ప్రేక్షకులు సినిమాను వీక్షించడం ఈ క్రేజ్‌కు నిదర్శనమన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘ఇరుముడి’ విజయాన్ని మిరాకిల్‌గా అభివర్ణించారు. తమ బ్యానర్లో ఇప్పటికే ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ అందుకున్న విజయం మాత్రం పూర్తిగా నెక్స్ట్ లెవల్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమా సాధిస్తున్న కలెక్షన్స్, ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు ఒక ప్రత్యేకమైన మూమెంట్‌లా అనిపిస్తున్నాయని చెప్పారు.
“ఇలాంటి విజయం ఒక నటుడి లేదా నిర్మాత కెరీర్లో ఒకసారి, రెండు సార్లు మాత్రమే వస్తుంది. కొన్ని విజయాలు దశాబ్దానికి ఒకసారి, మరికొన్ని రెండు దశాబ్దాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. ‘ఇరుముడి’ అలాంటి అరుదైన విజయాల్లో ఒకటి” అంటూ నవీన్ ఎర్నేని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సినిమాల థియేట్రికల్ రన్ రెండు, మూడు వారాలకే పరిమితమవుతున్న పరిస్థితుల్లో ‘ఇరుముడి’ మాత్రం రోజురోజుకీ మరింత బలంగా మారుతూ ట్రెండ్‌ను మార్చేసిందని అన్నారు.
ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం విశేషమని శివ నిర్వాణ పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి-కూతుళ్లు ఎమోషనల్ అవుతూ సినిమా చూడటం, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మూడు తరాల ప్రేక్షకులు కలిసి చూసి ఆదరించిన సినిమా కావడంతోనే దీనికి ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’ అనే పేరు సరైనదని చిత్ర బృందం భావిస్తోంది.
ప్రెస్మీట్లో నవీన్ ఎర్నేని చెప్పిన ఒక ఆసక్తికరమైన మాట కూడా అందరినీ ఆకట్టుకుంది. “సినిమాకి పూనకం వస్తే అది బ్లాక్‌బస్టర్.. ప్రేక్షకుడికి పూనకం వస్తే అది ‘ఇరుముడి’” అంటూ విజయవాడకు చెందిన తన స్నేహితుడు చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు. ఈ ఒక్క మాటే సినిమా ప్రేక్షకులపై చూపిన ప్రభావాన్ని తెలియజేస్తోందని అన్నారు.
‘ఇరుముడి’ విజయోత్సవ వేడుకను కూడా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
రవితేజ కెరీర్లో ఫస్ట్ టైమ్ రూ.200 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా, ఆయనను పూర్తిగా కొత్త అవతార్‌లో ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్, బలమైన కథనం, హృదయాన్ని తాకే సన్నివేశాలు, రవితేజ నటన, శివ నిర్వాణ టేకింగ్ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని సాధారణ బ్లాక్‌బస్టర్‌కు మించి జెనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.