‘రాకా’తో కేక పుట్టిస్తున్న ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబైలో కొంతభాగం షూట్ చేశారు. బుధవారం అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తోపాటు బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. గుండు, బీస్ట్ చేతితో నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తున్న అల్లు అర్జున్ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ లుక్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ‘రాకా’ నువ్వు కేక అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సరికొత్త సినిమాటిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లేలా ఈ చిత్రం ఉండబోతోందని టీం చెబుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని