స్పెషల్ సాంగ్‌తో ‘నేను రెడీ’

Bollywood Actress Nargis Fakhri Special Song For Nenu Reday :
బాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌‌తో, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. తన అందం, ఎనర్జీతో ఎన్నో హిట్ పాటలను మరింత స్పెషల్‌గా మార్చిన నర్గీస్, తెలుగు తెరపై మెరవబోతుండటం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’లో ఓ స్పెషల్ సాంగ్‌తో ఆమె టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
Bollywood Actress Nargis Fakhri Special Song For Nenu Reday :
హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్ పోస్టర్ విడుదల చేసి మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేశారు. పోస్టర్‌లో నర్గీస్ ఫక్రీ మెరిసే సిల్వర్ కాస్ట్యూమ్‌లో గ్లామరస్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. క్యాండిల్ లైట్స్ మధ్య వచ్చే వెలుగులతో అలంకరించిన సెట్స్‌, రెడ్ అండ్ బ్లూ లైటింగ్ మధ్య ఆమె స్టైలిష్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా జూన్ రెండో వారంలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Bollywood Actress Nargis Fakhri Special Song For Nenu Reday :

‘నువ్విలా’, ‘జీనియస్’, ‘రామ్ లీలా’, ‘సెవెన్’ వంటి చిత్రాల తర్వాత మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న హవీష్.. ఈ సినిమాతో పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సినిమా చూపిస్తా మామా’, ‘నేను లోకల్’, ‘ధమాకా’, ‘మజాకా’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన తన స్టైల్ కమర్షియల్ టచ్‌తో ‘నేను రెడీ’ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, మాటలను విక్రాంత్ శ్రీనివాస్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌తో పాటు రీ-రికార్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయని మేకర్స్ వెల్లడించారు. త్వరలో ఆడియో విడుదల చేసి, పూర్తి స్థాయి ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కమర్షియల్ అంశాలతో ‘నేను రెడీ’ హవీష్ కెరీర్‌లో మరో విజయంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’