Mareechika Trailer Raises Thrill Ahead of May 29 Release :
అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో సతీష్ కాసెట్టి రూపొందిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మే 29న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
Mareechika Trailer Raises Thrill Ahead of May 29 Release :
తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్ ప్రేమ, మిస్టరీ, ఎమోషన్స్, ద్రోహం, ప్రతీకారం వంటి అంశాలతో సాగింది. వెంకట లక్ష్మి అనే పల్లెటూరి యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించగా, సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ నటించారు. ‘మరీచిక’ అనే మిస్టీరియస్ పాత్రలో రెజీనా కసాండ్రా ఆకట్టుకున్నారు. సంజూను మరీచిక హత్య చేసిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే సన్నివేశంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. తర్వాత కథలో ఒక్కో పాత్రకు మరో పాత్రతో ఉన్న సంబంధాలను చూపిస్తూ దర్శకుడు ఉత్కంఠను పెంచారు. ఎన్నారై యువతిగా కనిపించిన మరీచిక పాత్ర చుట్టూ అనేక అనుమానాలు సృష్టించారు. మొదట ప్రేమకథలా కనిపించే కథ, క్రమంగా సస్పెన్స్‌తో కూడిన సైకాలజికల్ థ్రిల్లర్‌గా మారుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Mareechika Trailer Raises Thrill Ahead of May 29 Release :
‘మరీచిక’ అంటే ఎండమావి అని అర్థం. అందుకు తగ్గట్టుగానే ఒక పాత్రకు మరో పాత్రతో సంబంధం ఉంది అన్నట్టుగా ఒకసారి, అసలు అలాంటి వ్యక్తే లేరు అన్నట్టుగా మరోసారి చూపించిన విధానం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూడు పాత్రలు చెప్పే విషయాల్లో ఏది నిజం, ఏది కల్పితం అనే ట్విస్టులతో ఎమోషన్స్, మిస్టరీ అంశాలు కలగలిసిన సైకలాజికల్ రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం థ్రిల్ చేయబోతోందని అర్థమవుతోంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కథను మరింత ఎలివేట్ చేసింది. లక్ష్మీ భూపాల కథ, మాటలు అందించగా, అరవింద్ కన్నబిరన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, విఠల్ కోసనం ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.






