ప్రేమకథకు పారిస్‌, హనీమూన్ సీన్‌కు స్విట్జర్లాండ్‌ అవసరమా

Kamal Haasan Warning the Film Industry :

ప్రేమకథకు పారిస్‌, హనీమూన్ సీన్‌కు స్విట్జర్లాండ్‌ అవసరమా
సినీ ఇండస్ట్రీని హెచ్చరిస్తూ కమల్ ఓపెన్ లెటర్

భారతీయ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం కీలకమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని నటుడు కమల్ హాసన్ అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, రవాణా, వాణిజ్యం, ఉత్పత్తి వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దాని ప్రభావం భారతీయ సినీ పరిశ్రమపై కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ మొత్తం కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులు, కార్మిక సంఘాలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు, ఓటీటీ సంస్థలకు ఉద్దేశించి కమల్ హాసన్ ఓ భారీ నోట్‌ను విడుదల చేశారు. సినిమా నిర్మాణంలో పెరుగుతున్న వ్యయాలను నియంత్రించేందుకు ఆచరణాత్మకమైన, స్థిరమైన విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించారు.

Kamal Haasan Warning the Film Industry :

“సినిమా కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి నిజంగా సినిమాకే ఉపయోగపడాలి కానీ కేవలం భారీ స్థాయిలో కనిపించేందుకు కాదు” అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బడ్జెట్లు పెరుగుతున్నప్పటికీ మార్కెట్ రికవరీ మాత్రం అసమానంగా కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు సహా మొత్తం సినీ వ్యవస్థపై భారం పడుతుందని హెచ్చరించారు. అయితే ఖర్చుల నియంత్రణ పేరుతో కార్మికులపై భారం మోపకూడదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలు, భద్రత, ఆహారం, రవాణా, వసతి, గౌరవం వంటి అంశాల్లో ఎలాంటి కోతలు ఉండకూడదన్నారు. అత్యంత కష్టపడే వారిపైనే భారాన్ని మోపడం అన్యాయమని పేర్కొన్నారు.

Kamal Haasan Warning the Film Industry :

సినీ పరిశ్రమలో పెరుగుతున్న అనవసర ఖర్చులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ప్రణాళిక లేకపోవడం, షూటింగ్‌లలో జాప్యం, భారీ ఎంటూరేజ్ కల్చర్, అవసరం లేని విదేశీ ప్రయాణాలు వంటి అంశాలను తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ప్రేమకథ కోసం పారిస్‌, ప్రతి హనీమూన్ సన్నివేశం కోసం స్విట్జర్లాండ్‌కే వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భారతదేశంలోనే అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని, మన దేశంపై మనకే మరింత నమ్మకం ఉండాలని వ్యాఖ్యానించారు. అలాగే షూటింగ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, స్థానిక వనరులను వినియోగించడం, సెట్ల నిర్మాణంలో పునర్వినియోగ సామగ్రిని ఉపయోగించడం వంటి పర్యావరణహిత చర్యలను కూడా ఆయన ప్రోత్సహించారు. అధిక వ్యయాన్ని సినిమాకి పరిమాణంగా భావించే ధోరణిని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

Kamal Haasan Warning the Film Industry :

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాధ్యతాయుత వినియోగం, ఖర్చుల నియంత్రణపై చర్చ జరుగుతోందని గుర్తుచేసిన కమల్ హాసన్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రతి రంగం ముందుచూపుతో వ్యవహరించాలని అన్నారు. సినీ పరిశ్రమ కూడా అదే బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
“ఇది వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం. సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం” అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగితే, రేపటి సినిమా భవిష్యత్తును కూడా కాపాడినట్లేనని కమల్ హాసన్ తన లేఖలో తెలిపారు.

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 7 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 3 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 4 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 11 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 6 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’