వరుణ్ సందేశ్ హీరోగా, కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఆహా సమర్పణలో శివ కంఠంనేని, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలుగా రూపొందుతున్న కొత్త చిత్రం “నా వైఫ్ మిస్సింగ్”. ఇటీవల నయనం వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో ప్రేమకథా అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రవీణ్, మోహిత్, సత్య శ్రీ (జబర్దస్త్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథను ఉమర్జీ అనురాధ అందించగా, స్క్రీన్‌ప్లేను శ్రీనివాస్ మండల రూపొందించారు. ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆహా బృందం స్క్రిప్ట్‌ను అందించగా, సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ తొలి క్లాప్ కొట్టారు. నటుడు, నిర్మాత, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. “మిస్ అయిన వైఫ్ ఎవరు?” అనే ఆసక్తికర అంశంతో చిత్ర బృందం త్వరలో మరిన్ని అప్డేట్స్ విడుదల చేయనుంది. సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, సాయి బాబు తలారి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.





