సమంత యాక్షన్‌ చూడాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే

సమంత లీడ్‌గా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు జూన్ 19కి మార్చినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌‌కు అద్భుతమైన స్పందన దక్కింది. దీంతో మరింత ఆదరణ దక్కాలంటే ఐపీఎల్ సీజన్ అయ్యాకే వస్తేనే బెటర్ అని భావిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడొచ్చినా ఆడియెన్స్‌కు మెమొరబుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని అన్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా సమంత యాక్షన్ అవతారం, చీరలో కనిపించే ఫైట్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

రీసెంట్‌గా సమంత పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఆ వీడియోలో సమంత యాక్షన్ అవతారం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. గన్ హ్యాండ్లింగ్ నుంచి ఫైట్ మూమెంట్స్ వరకు ప్రతి ఫ్రేమ్‌లో ఆమె చూపించిన ఎనర్జీ టీమ్‌లోనే ప్రత్యేక చర్చకు దారితీసింది. ‘ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు.. చూస్తారుగా’ అని సమంత చెప్పడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. మొత్తానికి, విడుదల తేదీ మారినా ‘మా ఇంటి బంగారం’ పై ఉన్న బజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొత్త తేదీ జూన్ 19తో ఈ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత పెరిగాయి. పైగా ‘ఓ బేబీ’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

 

 

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’