త్వరలో అరుపులు వినండి

‘బాణం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పదిహేడేళ్ల కెరీర్‌‌లో ఇరవై రెండు సినిమాల్లో నటించారు నారా రోహిత్. డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ అనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఎంపికచేసుకునే కథతోపాటు టైటిల్స్ విషయంలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. గతేడాది ‘సుందరకాండ’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన ఆయన.. తాజాగా మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. రోహిత్ నారా #RN23 అనే హ్యాష్ ట్యాగ్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ బ్యానర్‌‌లో తెరకెక్కుతోన్న 5వ సినిమా ఇది. భరత్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను కూడా ఆయనే అందిస్తున్నారు.
ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. యూనివర్సల్ ఎమోషన్స్‌తో కూడిన కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. “షౌటింగ్ సూన్” (త్వరలో అరుపులు వినండి) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేలా ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలను మిళితం చేసిన వినోదాత్మక కథతో సినిమా రూపొందనుంది. త్వరలోనే ముహూర్త కార్యక్రమంతో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

 

Related Posts

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

Peddi Trailer Takeover Event Live in Mumbai :https://www.youtube.com/live/1Ioap46edNs ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైలర్ మరికొన్ని క్షణాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఈవెంట్ ప్రస్తుతం ముంబైలో గ్రాండ్‌గా జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్…

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

Kamal Haasan–Sivakarthikeyan Second Movie Seyon Start : ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘సియాన్’. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్…

One thought on “త్వరలో అరుపులు వినండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’