సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ గ్లోబల్ ప్రమోషన్స్‌లో మరో స్టెప్ ముందుకేసింది. తాజాగా మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “Bonjour la France 🇫🇷… We have celebrated his stories for years… now it’s your turn” (Bonjour ఫ్రాన్స్.. మేము ఆయన కథలను ఏళ్ళ తరబడి ఆదరించాము… ఇప్పుడు మీ వంతు వచ్చింది) అంటూ ఈ లోపు తమ వారణాసి #VARANASI విశేషాలను కూడా వీక్షించండి అని పోస్ట్ చేశారు. ఈ జూన్ కోసం సిద్ధంగా ఉండండి!!! అంటూ ప్రారంభమైన ఈ ట్వీట్‌తో, ఫ్రాన్స్ ఆడియెన్స్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అంతేకాదు, “Also catch our VARANASI glimpse… meet our director @ssrajamouli and hear what he has to share” అంటూ దర్శకుడు రాజమౌళిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. జూన్‌లో జరగబోయే ఈ ఈవెంట్స్‌కు సిద్ధంగా ఉండాలని కూడా టీమ్ స్పష్టం చేసింది. ఇప్పటికే మెక్సికోలో జరిగిన ఈవెంట్‌తో ‘వారణాసి’ గ్లోబల్ ప్రమోషన్స్‌కు గ్రాండ్ స్టార్ట్ ఇచ్చిన టీమ్, ఇప్పుడు ఫ్రాన్స్‌లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో రాజమౌళి తన సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గర చేయడానికి ప్లాన్ చేస్తున్న విధానం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. షూటింగ్ కొనసాగుతూనే గ్లోబల్ ప్రమోషన్స్‌ను సమాంతరంగా నిర్వహించడం ద్వారా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా నిలబెట్టాలని రాజమౌళి టీమ్ స్పష్టంగా సూచిస్తోంది. జూన్‌లో ఫ్రాన్స్ ఈవెంట్స్ తర్వాత ఈ సినిమా హైప్ మరింత పెరగడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ విషయంపై ఎస్ ఎస్ కార్తికేయ కూడా స్పందిస్తూ, ఈ టూర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఇలా ప్రతి అవకాశం ఉపయోగించుకుంటూ ‘వారణాసి’ని గ్లోబల్ స్టేజ్‌పై ప్రెజెంట్ చేయడంలో రాజమౌళి చూపిస్తున్న స్ట్రాటజీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తోంది.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందుతుండటం విశేషం. గ్రాండ్ విజువల్స్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రాజమౌళి ఒకపక్క షూటింగ్ చేస్తూనే, మరోపక్క గ్లోబల్ ప్రమోషన్స్‌ను సమాంతరంగా నడిపించడం ఆయన ప్లానింగ్‌కు నిదర్శనం. మొత్తానికి, షూటింగ్ వేగం తగ్గకుండా, ప్రమోషన్స్‌లోనూ అదే స్పీడ్‌ను కొనసాగిస్తూ ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే దిశగా రాజమౌళి వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.




