అప్పుడు కూతురిని.. ఇప్పుడు మనవరాలిని పరిచయం చేస్తున్న ఎంఎస్ రాజు

తెలుగు సినీ పరిశ్రమలో తరాలు మారినా, ప్రతిభ మాత్రం వారసత్వంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన పరిణామమే ఇప్పుడు ‘అగధ’ సినిమాతో మరోసారి కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్‌‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ రాజు గతంలో వనిత విజయ్‌కుమార్‌‌ను ‘దేవి’ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు అదే ఎంఎస్ రాజు ఈసారి ఆయన డైరెక్షన్‌లోఆమె కుమార్తె జోవికా విజయ్‌కుమార్‌‌ను ‘అగధ’ చిత్రం ద్వారా నటిగా పరిచయం చేస్తున్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలను తెరపైకి తీసుకువచ్చిన దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్‌‌గా గుర్తింపును తెచ్చుకున్న మంజుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ఆమె మనవరాలు జోవికా తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. ‘అగధ’లో జోవికా ‘హరిణి’ అనే పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన క్యారెక్టర్ పోస్టర్‌లో, వర్షంలో తడుస్తూ పురాతన నేపథ్యంలో కనిపించిన ఆమె లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆమె కళ్లలో కనిపించే అమాయకత్వం, అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి ఈ పాత్రలోని మర్మాన్ని సూచిస్తున్నాయి.

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు చూసినా, ‘అగధ’ ఒక ఆధ్యాత్మికత, మిస్టరీ, ఇంటెన్సిటీ కలగలిసిన కథగా ఉండబోతోందని అర్థమవుతోంది. భారీ సెట్స్, 85 రోజుల షూటింగ్, దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఈ సినిమా ప్రత్యేకమైన విజువల్ అనుభూతిని అందించబోతుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 9 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 6 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 7 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్