ప్రభాస్ అభిమానులకు నోస్టాలజిక్ ట్రీట్‌గా నిలిచిన క్లాసిక్ మూవీ డార్లింగ్ Darling మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. 2010లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. “తొలిప్రేమ” ఫేమ్ ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ప్రభాస్, కాజల్ అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ, వినోదాత్మక కథనం, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి.
ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మళ్ళీ 16ఏళ్ల తర్వాత 4K టెక్నాలజీతో రీమాస్టర్ చేసి ఏప్రిల్ 23, 2026న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు.
రీ-రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. పలు నగరాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతూ, అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.
ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేక స్థానం కలిగి ఉండగా, కొత్త తరానికి ఈ ప్రేమకథను పరిచయం చేయడమే ఈ రీ-రిలీజ్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్.. ఆయన కాస్ట్యూమ్స్ డిఫరెంట్ గా ఉంటూ.. (ప్రభా) పాత్రలో స్టైలిష్‌యూత్‌ఫుల్‌గా కనిపించారు. ముఖ్యంగా, ‘ఈశ్వర్’, ‘వర్షం’ తరహా మాస్ ఇమేజ్ నుండి బయటపడి, క్లాస్ అండ్ రొమాంటిక్ పాత్రలో ఆయన చేసిన నటన, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రభాస్ , కాజల్ అగర్వాల్ (నందిని) మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిన్ననాటి ప్రేమికులుగా వారి నటన, ఎమోషనల్ సీన్స్ చాలా సహజంగా ఉంటాయి.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన “నీవే”, “బుల్లె”, “హోసన్నా” వంటి పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటాయి.
డైరెక్టర్ కరుణాకరన్ మార్క్: కరుణాకరన్ తనదైన శైలిలో ప్రేమకథను, వినోదాన్ని బ్యాలెన్స్ చేస్తూ, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
కామెడీ సన్నివేశాలు. ప్రభాస్, కాజల్, ప్రభు, ఇతర హాస్యనటుల మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా స్విట్జర్లాండ్ నేపథ్యంలో సాగే కామెడీ సీన్స్ బాగా అలరిస్తాయి.
ఒక గ్యాంగ్‌స్టర్ కూతురిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ప్రభాస్ తన పాత ప్రేమకథను చెప్పే సన్నివేశాలు, అలాగే ఆసక్తికరమైన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. ఫైనల్.. ‘డార్లింగ్’ ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇది ఎప్పటికీ చూసేలా ఉంటుంది.





