Megastar Chiranjeevi Auto Johnny Is Back
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ‘ఆటో జానీ గుర్తున్నాడా?’ అంటూ తన కొత్త సినిమా ‘కాకా’కు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. ఈ సంక్రాంతికి సరికొత్తగా ఆటో జానీ మీ ముందుకు వస్తున్నాడంటూ సినిమా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.
Megastar Chiranjeevi Auto Johnny Is Back
చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
తాజాగా చిరంజీవి షేర్ చేసిన పోస్టర్లో ‘ఆటో జానీ గుర్తున్నాడా?’ అనే ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి చేయాలనుకున్న ‘ఆటో జానీ’ సినిమా గుర్తుకు వస్తుండటంతో ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ‘కాకా’ సినిమా వాయిదా పడనుందంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన ట్వీట్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘ఆటో జానీ’ రూపంలో మిమ్మల్ని అలరించడానికి వస్తున్నానని, దర్శకుడు బాబీతో పాటు మూవీ టీమ్ ఈ సినిమాను ఓ మరిచిపోలేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడుతోందని చిరంజీవి పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రచయితలుగా వ్యవహరిస్తున్నారు. భాను-నందు సంభాషణలు అందిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ అందిస్తున్నాడు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.