ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘అగధ’

సుమంత్ ఆర్ట్స్ పతాకంపై మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ట్రెండ్ సెటర్టర్స్‌తో నిర్మాతగా ఆయనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఎమ్మెస్ రాజు..
దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ని మళ్లీ మళ్లీ అనుసరించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన ‘అగధ’ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే శ్రమిస్తున్నారు. తాజాగా ‘అగధ’ ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్ ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలచుకోవడం, చివరగా ఒక పోస్టర్ ని చూసి అక్కడ ఏదో ఉందని భయపడటంతో ఆ వీడియో ఎండ్ అవుతుంది. తీరా అక్కడ ఉన్న పోస్టర్‌‌తో ‘అగధ’సినిమాను ప్రకటించారు. ఒక చీకటి గుహ. చుట్టూ వెలుగుతోన్న కొన్ని కాగడాలు. చీకటే కాదు ఆ సన్నని వెలుతురు కూడా భయానకంగా ఉంది. అక్కడ ఒక భారీ విగ్రహం. మొహమంతా మిస్టిక్ గా ఉంది. ఆ విగ్రహానికి 12 చేతులు. ఈ విగ్రహం ముందు … వెనుతిరిగి ఉన్న ఒకమ్మాయి . ఆమె వేషధారణ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఈ పోస్టర్ తోనే ఒక ఆసక్తిని జనరేట్ చేశారు ఎమ్మెస్ రాజు.
మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా ‘అగధ’ను రూపొందిస్తున్నారాయన. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘అగధ’ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రం గురించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ “ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. ఇందులో నటించిన తారలు ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్ చేసాం. ఈ సినిమాలో 45 నిమిషాల వి ఎఫ్ ఎక్స్ ఉంటుంది. దాన్నిబట్టే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వి. ఎన్. సుబ్బరాజ్ , నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు, రచన- దర్శకత్వం: ఎమ్మెస్ రాజు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని