రంపచోడవరం అడవుల్లో ‘భోగి’

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్ , బ్లాక్‌బస్టర్ చిత్రనిర్మాత సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మాణంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్-లుక్ విడుదలకు లభించిన అద్భుత స్పందన నేపథ్యంలో, చిత్ర బృందం ఇప్పుడు రాజమండ్రిలో అత్యంత కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. షూటింగ్ రాంపచోడవరం అడవులలోని కఠినమైన, సవాలుతో కూడిన ప్రదేశాలలో జరగనుంది. ఇక్కడ ఎక్సయిటింగ్, టఫ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలను ప్రముఖయాక్షన్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఇవి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే యాక్షన్ అనుభూతిని అందించనునాయి. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇది సినిమా నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది. “ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ‘భోగి’ చిత్రంలో శర్వానంద్ ఒక సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ అంచనాలు పెంచింది. దర్శకుడు సంపత్ నంది, 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవికమైన కథనం,పవర్ ఫుల్ నేపథ్యంతో ఈ చిత్రం ఇంటెన్స్ డ్రామాతో గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘భోగి’టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్, కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా భోగి బ్లాస్టింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్ట్ 28, 2026న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా థియేటర్‌లలో విడుదల కానుంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని