Good Time Set for a Youthful Theatrical Ride
యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ఫ్రెండ్షిప్, లవ్, రియలిస్టిక్ క్యారెక్టర్ల కలయికగా తెరకెక్కిన సినిమా ‘గుడ్ టైమ్’. ఎకో క్రాఫ్ట్ మీడియా సమర్పణలో మూవీ బ్రాట్స్ బ్యానర్‌పై రమేష్ జిల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చాణక్య జిల్లా దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.
Good Time Set for a Youthful Theatrical Ride
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘గుడ్ టైమ్’ టైటిల్ చాలా క్యాచీగా ఉందని, సినిమాకు పనిచేసిన వారిలో ఎక్కువ మంది యంగ్ టాలెంట్ ఉన్నారని అన్నారు. హీరో నిఖిల్ గాజులకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందని చెప్పారు. టీజర్లో ప్రతి షాట్ చాలా ఒరిజినల్‌గా అనిపించిందని, యంగ్ టీమ్‌తో దర్శకుడు చాణక్య మంచి సినిమా చేశారనే నమ్మకం ఉందన్నారు.
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. ‘గుడ్ టైమ్’ టీమ్ తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. తాము కూడా తమ సినిమా సమయంలో ఇలాంటి సపోర్ట్ కోసం ఎదురుచూశామని, అందుకే ఈ యంగ్ టీమ్‌ను ప్రోత్సహించేందుకు వచ్చామని చెప్పారు. ఈ సినిమాతో నిఖిల్‌కు మంచి పేరు రావాలని, టీమ్ అందరికీ ‘గుడ్ టైమ్’ మొదలవ్వాలని కోరారు.
హీరో నిఖిల్ గాజుల మాట్లాడుతూ.. సినిమా చేయడం తమ డ్రీమ్ అని, ఇప్పుడు ఆ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి చూసుకోవడం తమకు కల నిజమైన అనుభూతిని ఇస్తోందన్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు వస్తున్న స్పందన తమలో మరింత నమ్మకాన్ని పెంచిందని చెప్పారు. చిన్న సినిమా తెరకెక్కించి, ప్రమోట్ చేసి థియేటర్లలోకి తీసుకురావడం ఎంతో కష్టమని, తమ కంటెంట్‌ను ఇప్పటికే ప్రేక్షకులకు చూపించామని అన్నారు. 2 గంటల 17 నిమిషాల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా ‘గుడ్ టైమ్’ అని, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఈ మాట చెబుతున్నామని పేర్కొన్నారు.
హీరోయిన్ అన్యుక్త నలాని మాట్లాడుతూ.. సినిమాలో నిశ్చల అనే క్యారెక్టర్లో నటించానని చెప్పారు. చేసిన తర్వాత ఆలోచించే, కొంత తింగరి స్వభావం ఉన్న పాత్రగా నిశ్చలను ప్రేక్షకులు ఇష్టపడతారని అన్నారు. ఫ్రెండ్స్ మధ్య బాండింగ్, ప్రేమికుల మధ్య రిలేషన్‌తో పాటు ఈ జనరేషన్ యూత్ ఆలోచనలు, ఎమోషన్స్‌ను ఫన్నీగా చూపించామని తెలిపారు. అక్టోబర్ 9 తన కెరీర్లోనే కాకుండా ‘గుడ్ టైమ్’ టీమ్ మొత్తానికి మెమొరబుల్ డేగా నిలుస్తుందని అన్నారు.
దర్శకుడు చాణక్య జిల్లా మాట్లాడుతూ.. ‘గుడ్ టైమ్’ ఒక కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పారు. సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకులను నవ్వించేలా, ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని, ఎక్కడా ల్యాగ్ అనిపించదని అన్నారు. లీడ్ ఆర్టిస్టులందరూ అద్భుతంగా నటించారని, సినిమా అంతా ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని తెలిపారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా టైటిల్లో ఉన్నట్టుగానే తమ టీమ్‌కు, ప్రేక్షకులకు ‘గుడ్ టైమ్’ తీసుకొస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
నిర్మాత రమేష్ జిల్లా మాట్లాడుతూ.. సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఫన్‌తో సినిమాను రూపొందించామని చెప్పారు. ముఖ్యంగా యూత్ తమను తాము స్క్రీన్‌పై చూసుకున్న అనుభూతి పొందుతారని, ప్రతి యూత్ ఆడియెన్ సినిమాతో రిలేట్ అవుతారని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చాయని, ఇక సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాల్సిన సమయం వచ్చిందన్నారు. అక్టోబర్ 9న థియేటర్లకు వచ్చి తమ చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరారు.
రైటర్ అభిరామ్ మాట్లాడుతూ.. ఒక యావరేజ్ కుర్రాడి పీడకల చుట్టూ సినిమా సాగుతుందని, ఆ కాన్సెప్ట్‌ను థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పారు. ఎడిటర్ సాయి తరుణ్ సినిమా సుమారు రెండు గంటల పాటు ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తుందని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ నిర్వాణ్ ఆత్రేయ మాట్లాడుతూ, సినిమాకు పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డామని చెప్పారు. టీజర్, ట్రైలర్‌లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
నటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ.. అల్వాల్‌లో కనిపించే ఓ లత్కోర్ కుర్రాడి కథగా సినిమాను ఆసక్తికరంగా అభివర్ణించారు. నిఖిల్, హృతిక్ శెట్టితో తన కాంబినేషన్ సీన్స్ నవ్వులు పూయిస్తాయని, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారని అన్నారు.
హృతిక్ శెట్టి మాట్లాడుతూ.. అల్వాల్ బస్తీని దగ్గరగా చూసిన అనుభూతి సినిమాతో కలుగుతుందని చెప్పారు. హీరో పాత్ర అప్పులు తీసుకుంటాడు కానీ తిరిగి చెల్లించని క్యారెక్టర్‌గా ఉంటుందని, ఈ నెల 9న థియేటర్లలో సినిమాను చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని కోరారు.
నటుడు హరి మున్నంగి మాట్లాడుతూ.. గతంలో తాను చేసిన సాఫ్ట్ రోల్‌కు భిన్నంగా ‘గుడ్ టైమ్’లో రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లో కనిపిస్తానన్నారు. ప్రేక్షకులకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా ఇదని తెలిపారు.
నటి సౌందర్య లహరి మాట్లాడుతూ.. సినిమాలో ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తానని, ప్రస్తుత తరంతో పాటు గత తరం ప్రేక్షకులను కూడా సినిమా ఆకట్టుకుంటుందని చెప్పారు.
సీయీవో ఐశ్వర్య జిల్లా మాట్లాడుతూ.. తమ జర్నీలో ఇప్పటివరకు 80 శాతం సక్సెస్ సాధించామని, ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను ఆదరిస్తే అది 100 శాతం విజయంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచిలర్స్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారని తెలిపారు.
నటి సునీత మనోహర్ మాట్లాడుతూ.. తనకు సినిమాలో కీలకమైన పాత్ర చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి వయసు ప్రేక్షకుడిని అలరించే అంశాలు సినిమాలో ఉన్నాయని, అన్ని ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందని తెలిపారు.