Balayya Is Back: ‘Daada’ Shoot Resumes in Mysore
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఇటీవల గాయపడిన ఆయన పూర్తిగా కోలుకుని తన తాజా చిత్రం ‘దాదా’ షూటింగ్లో పాల్గొంటున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తాజా షెడ్యూల్ మైసూర్లో ప్రారంభమైంది.
Balayya Is Back: ‘Daada’ Shoot Resumes in Mysore
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘దాదా’పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా బాలకృష్ణ రగ్గడ్, స్టైలిష్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
తాజాగా మొదలైన మైసూర్ షెడ్యూల్ కీలకమైనదిగా ఉండనుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో ప్రధానంగా టాకీ పార్ట్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణతో పాటు మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ తదితరులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. కథకు కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలకృష్ణ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ‘ది కింగ్ ఆఫ్ కెయాస్’ అంటూ ఇప్పటికే ఆయన పాత్రను పరిచయం చేయడంతో.. సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. గోపీచంద్ మలినేని తనదైన స్టైలిష్ టేకింగ్‌తో భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘దాదా’పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొస్తోంది.
ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
షూటింగ్ తిరిగి ఊపందుకోవడంతో ‘దాదా’పై ఉన్న అంచనాలకు మరింత జోష్ వచ్చింది. మాస్ యాక్షన్, స్టైలిష్ టేకింగ్, బాలయ్య పవర్ఫుల్ అవతార్‌తో ఈ సినిమా భారీ కమర్షియల్ స్పెక్టకిల్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ‘దాదా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.