Vijay Devarakonda -Rashmika Podcast Creates Sensation
విజయ్ దేవరకొండకు నార్త్‌లో ఉన్న క్రేజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పష్టమైంది. ‘రణబాలి’ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ప్రముఖ హోస్ట్ శుభాంకర్ మిశ్రాతో చేసిన ఫస్ట్ హిందీ పాడ్‌కాస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ పాడ్‌కాస్ట్‌కు ఇప్పటివరకు ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషంగా మారింది.
Vijay Devarakonda -Rashmika Podcast Creates Sensation
సినిమా ప్రమోషన్స్‌ను దాటి విజయ్–రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మరోసారి బయటపడింది. ముఖ్యంగా హిందీ ఆడియెన్స్ నుంచి ఈ ఎపిసోడ్‌కు వచ్చిన స్పందన, విజయ్ దేవరకొండకు ఉత్తరాదిలో ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను తెలియజేస్తోంది.
హోస్ట్ శుభాంకర్ మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పాడ్‌కాస్ట్ క్లిప్‌లకు కూడా భారీ స్పందన లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదయ్యాయి. ఇక యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాడ్‌కాస్ట్ కేవలం 24 గంటల్లోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
ఫేస్‌బుక్‌తో పాటు వివిధ సోషల్ మీడియా, మీమ్ పేజీల్లోనూ ఈ ఎపిసోడ్‌కు భారీ రీచ్ లభించింది. అన్ని మీమ్ పేజీలను కలిపి 500 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం ఈ పాడ్‌కాస్ట్‌కు ఉన్న వైరల్ ఇంపాక్ట్‌ను చెప్పకనే చెబుతోంది.
మొత్తంగా చూస్తే.. ‘రణబాలి’ కోసం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చేసిన ఈ ఫస్ట్ హిందీ పాడ్‌కాస్ట్ సినిమా ప్రమోషన్‌లోనే ఒక హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్‌లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌కు ఈ వ్యూస్ మరో బలమైన ఉదాహరణగా మారాయి.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ‘రణబాలి’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.