బ్రేకింగ్ : కమల్, రజనీ సినిమాకు ఎందుకు ఇలా జరుగుతుంది..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో సినిమా అంటేనే.. అనౌన్స్ చేసిన రోజు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ నిర్మాతగా, రజినీ కాంత్ హీరోగా కొన్నాళ్ల క్రితం ఓ సినిమా ప్రకటించగా.. దీనికి ముందుగా సుందర్ సి ను దర్శకుడిగా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని రోజులకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. దీంతో ఆయన ప్లేస్ లోకి డాన్ డైరెక్టర్  శిబి చక్రవర్తిని ఫైనల్ చేశారు. ఈ కాంబో దాదాపు ఖాయమై ఈ నెలలో సెట్స్ కు వెళ్లాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు శిబి చక్రవర్తి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లోకి అశ్వత్ మారిముత్తు ఎంటర్ అయ్యాడని తెలుస్తుంది. తమిళంలో ఓ మై కడవులే (తెలుగులో ఓరి దేవుడా రీమేక్) రూపొందించిన అశ్వత్ చేతికి ఈ భారీ ప్రాజెక్ట్ వెళ్ళిందని కోలీవుడ్ టాక్. కమల్, రజినీ సినిమాకు.. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అశ్వత్ అయినా ఈ సినిమా ను మొదలు పెడతాడో లేదో చూడాలి. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పై ఆర్. మహేంద్రన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్‌తో తెరకెక్కించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. రజినీకాంత్ కెరీర్‌‌లో ఇది 173వ చిత్రం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్‌కి రిలీజ్ చేయనున్నట్టు మాత్రం ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌‌తో ‘జైలర్ 2’ మూవీ చేస్తున్నారు. అలాగే నెల్సన్ డైరెక్షన్‌లోనే రజినీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా రీసెంట్‌గా ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 6 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని