Venkatesh ‘Narayanamma’ Song Creates a Buzz
విక్టరీ వెంకటేష్ సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’తో మరోసారి అదే జోనర్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘నారాయణమ్మ’ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Venkatesh ‘Narayanamma’ Song Creates a Buzz
పాటలో వెంకటేష్‌తో పాటు డింపుల్ హయాతి, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా వెంకీ మామతో ముగ్గురు భామల కాంబినేషన్ పాటకు మంచి హైప్ తీసుకొచ్చింది. డింపుల్ హయాతి స్పెషల్ అప్పియరెన్స్ పాటకు మరింత గ్లామర్‌ను యాడ్ చేసింది.
‘నారాయణమ్మ’ను చూస్తే ఇది సింపుల్ సాంగ్ కాదని.. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోన్‌ను ముందుగానే పరిచయం చేసేలా ఉందని అర్థమవుతోంది. ఫోక్ టచ్‌తో కూడిన మాస్ బీట్‌కు వెంకటేష్ తనదైన ఎనర్జీతో సందడి చేశారు. పాటలోని విజువల్స్ కూడా కలర్ఫుల్గా ఉండటంతో ఫ్యాన్స్‌కు ఇది మంచి ట్రీట్‌గా మారింది.
ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, రామ్ మిరియాల, ప్రభ కలిసి పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మ్యూజిక్, విజువల్స్, వెంకటేష్ ఎనర్జీ కలవడంతో ‘నారాయణమ్మ’ ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’లో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథ, కామెడీ, ఎమోషన్‌తో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ను జోడించి త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల సక్సెస్‌లో రైటర్‌గా త్రివిక్రమ్‌కు ఎంతో పేరొచ్చింది. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.