గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై, భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధుల క్లోజప్‌లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు విజువల్ ఫీస్ట్‌ని అందించాయి. భరత భూమికి ప్రతీకగా నిలిచేలా ‘భరతవర్ష’ అనే టైటిల్‌ను రివీల్ చేయడం పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో గోపీచంద్ యోధుడిలా కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. ఈ పాత్ర కోసం ఆయన కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవడం ఆకట్టుకుంది. “భరతవర్ష” చిత్రం అద్భుతమైన విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, గత యుగాన్ని ఎంతో నైపుణ్యంతో పునర్నిర్మించిన తీరు అద్భుతంగా వుంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన విజన్ ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ, భారత చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని గొప్పగా ఆవిష్కరించారు. భారీ స్థాయి, భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది.హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా కొనసాగుతోంది. సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా చిన్న, మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుదీప్ దేవ్ వర్క్ చేస్తున్నారు.





