నేను ఎలాంటి తప్పు చేయలేదు.. నాకు డబ్బు ఆశ లేదు : సింగర్ మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గాయని మంగ్లీ తెలిపింది. తనకు డబ్బు ఆశ లేదని, పాటలే తన ప్రపంచమని మంగ్లీ చెప్పారు. ఈ కేసులో తన సోదురుడికి కూడా ఎలాంటి ఇన్వాల్వ్ మెంట్ లేదని ఆమె అన్నారు. న్యాయవాది సుబ్బు ప్రచారం కోసం, పాపులర్ అయ్యేందుకు తనపై కేసు పెట్టారని మంగ్లీ అన్నారు. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంగ్లీ, ప్రెస్ మీట్ లో ఉద్వేగానికి లోనయై కన్నీళ్లు పెట్టుకున్నారు.
గాయని మంగ్లీ మాట్లాడుతూ ‘‘- మైక్రో ఫైనాన్స్ కేసులో నా పేరు, నా సోదరుడు పేరును మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం నాకు తెలిసినప్పుడు బెంగళూరులో ఒక ప్రోగ్రాం లో ఉన్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదని వెంటనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను. ప్రోగ్రామ్స్ కోసం నా సోదరుడి ద్వారా చాలా మంది నన్ను సంప్రదిస్తుంటారు. లాయర్ సుబ్బు పబ్లిసిటీ కోసం, ఆ పబ్లిసిటీ ద్వారా బిగ్ బాస్ కు వెళ్లాలనే నాపై కేసు పెట్టాడు. నేను కూడా న్యాయపరంగా అతన్ని ఎదుర్కుంటా. నాకు డబ్బు మీద ఆశ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో తమకు ప్రచారం చేయాలంటూ వివిధ పార్టీల వారు నాకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. నేను ఒప్పుకోలేదు. నా సోషల్ మీడియా పోస్టులు కూడా చెక్ చేసుకోండి. ఈ మైక్రో ఫైనాన్స్ మోసంలో బాధితుల తరుపున కూడా నేను సపోర్ట్ గా నిలబడతాను”అని అన్నారు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని