2K Lovers Movie Launched with Grand Pooja Ceremony
ఎం.బి. ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘2కె లవర్స్’ (Soul of Love). మోహిత్ పెడాడ, శృతి శంకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. బిచ్చు నాయక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రసూల్ భాయ్ కథను అందిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి.
2K Lovers Movie Launched with Grand Pooja Ceremony
ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వీఎన్ ఆదిత్య క్లాప్ ఇవ్వగా.. మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.

తెలంగాణ నేటివిటీకి తగ్గ ప్రేమకథ
‘2కె లవర్స్’ కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు రాజేష్ నాయుడు తెలిపారు. ప్రేమకథకు కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. కథను రసూల్ భాయ్ అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రేక్షకులను ఆద్యంతం అలరించేలా సినిమా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
ఎమోషన్స్‌తో పాటు వినోదం
నిర్మాత బిచ్చు నాయక్ మాట్లాడుతూ ఎం.బి. ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభిస్తూ తొలి చిత్రంగా ‘2కె లవర్స్’ను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ యాస, నేటివిటీతో ఇప్పటివరకు చూడని తరహాలో ప్రేమకథను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. ప్రేమతో పాటు కుటుంబ భావోద్వేగాలు, హాస్యం సినిమాలో ప్రధానంగా ఉంటాయని, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కథ ప్రేక్షకులను వెంటాడేలా ఉంటుందని తెలిపారు.
రచయిత రసూల్ మాట్లాడుతూ ‘2కె లవర్స్’లో ప్రేమ, రోదన, ఆవేదన, బంధాలు, అనుబంధాలు, హాస్యం వంటి విభిన్న భావోద్వేగాలను మేళవించామని అన్నారు. ఈ కథ ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కొత్త తరహా ప్రేమకథ
హీరో మోహిత్ పెడాడ మాట్లాడుతూ తనకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘2కె లవర్స్’ రెగ్యులర్ లవ్ స్టోరీస్‌కు భిన్నంగా ఉంటుందని, తనకు మంచి పాత్ర లభించిందని చెప్పారు.
హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ కథ వినగానే తనకు ఎంతో ఎమోషనల్‌గా అనిపించిందని తెలిపారు. సినిమాలో భావోద్వేగాలతో పాటు కావాల్సినంత కామెడీ కూడా ఉంటుందని చెప్పారు.
నటుడు ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ ‘2కె లవర్స్’లో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రంలో మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, సూర్య, శివన్నారాయణ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.