The Red Bag to release on August 21
హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
The Red Bag to release on August 21
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది.
‘ది రెడ్ బ్యాగ్’ కేవలం ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ కాదని, ఇందులో ఎన్నో భావోద్వేగాలు, మానవ సంబంధాలు, ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. కథనే హీరోగా భావించి ఈ సినిమాను తెరకెక్కించామని, ప్రేక్షకులు టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేసేలా సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.
ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్‌గా, శివ శర్వాణి ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. శేఖర్ మోపురి సంగీతాన్ని అందించారు. ఆగస్టు 21న థియేటర్లలోకి రానున్న ‘ది రెడ్ బ్యాగ్’ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.