Baba Black Sheep release on Dasara
దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Baba Black Sheep release on Dasara
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఓ అనుకోని ఘటన చుట్టూ జరిగే పరిణామాలు.. వాటి కారణంగా పలువురి జీవితాల్లో చోటుచేసుకునే మార్పులు, వినోదాత్మక అంశాలతో సినిమా సాగనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు.
యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందిన ఈ పార్టీ సాంగ్‌లో అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్‌లపై ఎనర్జిటిక్ మూమెంట్స్‌ను కలర్ఫుల్గా తెరకెక్కించారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) సంగీతం అందించగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్ ఈ పాటను ఆలపించారు. విడుదలైన వెంటనే పాటకు మంచి స్పందన వస్తోంది.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. పాట చాలా క్యాచీగా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘బా బా బ్లాక్ షీప్’ మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. ‘‘ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ ఇది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 9న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదే. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. మొత్తం టీమ్ సహకారంతో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేశాం. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ అందిస్తాం’’ అని తెలిపారు.
మేఘాలయలో పూర్తిస్థాయిలో చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది చిత్రంగా ప్రత్యేకతను సొంతం చేసుకున్న ‘బా బా బ్లాక్ షీప్’.. క్రైమ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాల కలయికతో దసరా బరిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.