Nagarjuna Joins Capstone Home Services as Brand Ambassador
హైదరాబాద్‌లో హోమ్ సర్వీసెస్ రంగంలోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. రెండు దశాబ్దాలకుపైగా B2B సేవల రంగంలో మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హోమ్ సర్వీసెస్ యాప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఇంటి నిర్వహణకు అవసరమైన వివిధ రకాల సేవలను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
Nagarjuna Joins Capstone Home Services as Brand Ambassador
ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సందర్భంగా ఆయనను కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సంస్థ ప్రకటించింది. కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ డా. సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ కొడాలి, సంస్థ సీనియర్ నాయకత్వ బృందం, పరిశ్రమ భాగస్వాములు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఇల్లు నమ్మకంపై నిర్మించబడుతుందని, అదే విధంగా ఒక కస్టమర్ ఇంటికి వచ్చే ప్రతి సేవ కూడా నమ్మకంపై ఆధారపడి ఉండాలని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రముఖ సంస్థలకు మానవ వనరుల పరిష్కారాలను అందిస్తూ కాప్స్టన్ సంపాదించుకున్న నమ్మకం, ప్రొఫెషనలిజం, పారదర్శకత తనను ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడానికి ప్రేరేపించాయని తెలిపారు. కాప్స్టన్ ప్రయాణంలో భాగస్వామి కావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న పట్టణీకరణ, డిజిటల్ వినియోగం, మారుతున్న జీవనశైలి కారణంగా ఇంటి సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నైపుణ్యం కలిగిన సిబ్బంది, సేవల నాణ్యత, కస్టమర్ భద్రత, పారదర్శక ధరలు, సమయపాలన వంటి అంశాలు ఈ రంగంలో కీలకంగా మారాయి.

ఈ నేపథ్యంలో 17 సంవత్సరాలకుపైగా కార్యకలాపాల అనుభవం, శిక్షణ పొందిన సిబ్బంది, పటిష్టమైన ఆపరేషనల్ ప్రక్రియలు, టెక్నాలజీ ఆధారిత సర్వీస్ మేనేజ్మెంట్తో కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ వినియోగదారుల మార్కెట్లోకి ప్రవేశించింది.
కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ద్వారా బ్యూటీ & వెల్నెస్, క్లీనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్, AC సర్వీసులు, గృహోపకరణాల మరమ్మతులు, పెస్ట్ కంట్రోల్ తదితర అనేక రకాల సేవలను వినియోగదారులు పొందవచ్చు.
యాప్ ద్వారా వెరిఫైడ్ ప్రొఫెషనల్స్‌ను బుక్ చేసుకోవడంతో పాటు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. సేవలకు సంబంధించిన ధరలను ముందుగానే తెలుసుకునేలా పారదర్శక విధానాన్ని సంస్థ అందిస్తోంది. కాప్స్టన్ నిర్దేశించిన ఆపరేషనల్ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని సంస్థ తెలిపింది.
కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ డా. సి.ఆర్. నాయుడు మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖ సంస్థలకు మానవ వనరుల పరిష్కారాలు, సపోర్ట్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. కన్స్యూమర్ హోమ్ సర్వీసెస్ విభాగంలోకి ప్రవేశించడం తమ నైపుణ్యానికి సహజమైన విస్తరణగా అభివర్ణించారు.
నేటి కస్టమర్లు నమ్మకమైన నిపుణులు, పారదర్శకమైన ధరలు, సమయానుకూల సేవలు, స్థిరమైన నాణ్యతను కోరుకుంటున్నారని.. తమ అనుభవం, శిక్షణ పొందిన సిబ్బంది, కార్యకలాపాల్లో నైపుణ్యంతో హోమ్ సర్వీసెస్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలమనే నమ్మకం ఉందని అన్నారు.
కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కొడాలి మాట్లాడుతూ.. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన హోమ్ సర్వీసెస్ బ్రాండ్లలో ఒకటిగా ఎదగడమే తమ లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్ తమ ప్రయాణానికి తొలి అడుగు మాత్రమేనని, త్వరలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రధాన నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపారు.
టెక్నాలజీ ఆధారిత, విశ్వసనీయమైన, ప్రొఫెషనల్ హోమ్ సర్వీసులను అందించడంతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది నైపుణ్యం కలిగిన సర్వీస్ ప్రొఫెషనల్స్‌కు అర్థవంతమైన ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నాగార్జున బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతో కాప్స్టన్ హోమ్ సర్వీసెస్‌పై వినియోగదారుల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని సంస్థ భావిస్తోంది. టెక్నాలజీ, కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం, శిక్షణ పొందిన మానవ వనరులను సమన్వయం చేసి కస్టమర్లకు సులభమైన, నాణ్యమైన హోమ్ సర్వీస్ అనుభవాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ స్పష్టం చేసింది.