NTR Shoulder Surgery Successful ; Dragon Shoot on Hold
ఇటీవల భుజానికి గాయమైన ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌లోని KIMS హాస్పిటల్స్‌లో బుధవారం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని డాక్టర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆర్థోపెడిక్ సర్జన్స్ టీమ్ ఈ శస్త్రచికిత్సను చేపట్టిందని, డాక్టర్ ఆర్.ఏ. పునచంద్ర తేజస్వి, డాక్టర్ బైజంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సుపరనేని నేతృత్వంలో ఈ సర్జరీ జరిగినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సర్జరీ పూర్తిగా విజయవంతమైందని, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని KIMS వెల్లడించింది. ఆయన త్వరలోనే వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
NTR Shoulder Surgery Successful ; Dragon Shoot on Hold
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలోనే ఆయన భుజానికి గాయమైంది. గాయం తర్వాత వైద్యుల సూచనల మేరకు షూటింగ్‌కు దూరంగా ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు మరో మూడు నెలల వరకు బెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించడంతో తారక్ అప్పటివరకు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వక తప్పదు. భుజానికి సంబంధించిన గాయం కావడంతో యాక్షన్ సన్నివేశాలు, భారీ ఫిజికల్ మూవ్మెంట్స్ చేయడం వెంటనే సాధ్యం కాదు. అందుకే వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. దీంతో ‘డ్రాగన్’ చిత్రీకరణకు దాదాపు మూడు నెలల విరామం తప్పదని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ యాక్షన్ సీక్వెన్సులు, గ్రాండ్ స్కేల్ ప్రధాన బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆయన శారీరకంగా ఎక్కువగా పాల్గొనాల్సి ఉండటంతో.. ఆయన పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ కొనసాగించడం కష్టమే. దీంతో ఇప్పటికే ప్లాన్ చేసిన ‘డ్రాగన్’ షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్ అందుబాటులో లేని సమయంలో ఇతర నటీనటులతో చేయగలిగే సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం కూడా ఉంది. సినిమా షూటింగ్ ప్లానింగ్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్, చిత్రబృందం ఎలా మార్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రధాన లక్ష్యం పూర్తిగా కోలుకోవడమే. వైద్యుల అంచనా ప్రకారం రెండు నుంచి మూడు నెలల్లో ఆయన సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ‘డ్రాగన్’ షూటింగ్లో తిరిగి పాల్గొనే ఛాన్స్ ఉంది. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం వైద్యుల సూచనలు పాటిస్తూ పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది.