Haiwaan Teaser: Akshay vs Saif After 17 Years
బాలీవుడ్లో స్టార్ హీరోల కాంబినేషన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ లాంటి ఇద్దరు సీనియర్ హీరోలు దాదాపు 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’. దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం 2016లో మాలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘Oppam’సినిమాకు హిందీ రీమేక్‌గా వస్తోంది. ఇది తెలుగులో ‘కనుపాప’ పేరుతో డబ్ అయ్యింది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన ప్రియదర్శన్ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Haiwaan Teaser: Akshay vs Saif After 17 Years
తాజాగా విడుదలైన టీజర్లో కథను పూర్తిగా రివీల్ చేయకుండా.. మిస్టరీ, ఛేజ్, ప్రతీకారం అనే అంశాల చుట్టూ ఆసక్తిని పెంచేలా కట్ చేశారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ పాత్రను చూస్తే ఇంతకుముందు చూసిన ఆయన పాత్రలకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. సైఫ్ అలీఖాన్ పాత్రలోనూ ఒక ప్రత్యేకమైన మిస్టరీని క్రియేట్ చేశారు.
‘Oppam’/‘కనుపాప’ మోహన్‌లాల్ పుట్టుకతోనే చూపులేని వ్యక్తిగా కనిపిస్తారు. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేసే ఆయనకు చూపు లేకపోయినా వినికిడి, వాసన, స్పర్శ వంటి ఇతర ఇంద్రియాలు చాలా పదునుగా ఉంటాయి. ఒక హత్యకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా మారడంతో కథలో అసలు థ్రిల్ మొదలవుతుంది. పరిస్థితులు ఆయనపైనే అనుమానం కలిగించేలా మారుతాయి. తాను నిర్దోషినని నిరూపించుకోవడంతో పాటు అసలు నేరస్తుడిని పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కథకు ప్రధాన బలం. ఇప్పుడు ‘హైవాన్’లో సైఫ్ అలీఖాన్.. మోహన్ లాల్ పాత్ర పోషిస్తున్నారు.
అయితే దర్శకుడు ప్రియదర్శన్ తన కథను కొత్త ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘Oppam’లో మోహన్‌లాల్ పాత్ర చుట్టూ నేరం, హత్య, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటే.. ‘హైవాన్’ టీజర్లో మాత్రం అక్షయ్ కుమార్ పాత్రను మరింత డార్క్‌గా, భయపెట్టేలా చూపించారు. అక్షయ్ పాత్రలోని క్రూరత్వం, ఆయన నవ్వు, సైఫ్ పాత్రతో ఏర్పడే ఛేజ్.. ఇవన్నీ సినిమాను ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ తరహాలో ప్రెజెంట్ చేస్తున్నాయి. అక్షయ్ స్వయంగా ఈ పాత్రను తన కెరీర్లో తొలిసారి పూర్తి నెగిటివ్ రోల్ ఉన్న క్యారెక్టర్‌గా చెప్పారు. సాధారణంగా రీమేక్ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు కథను ఎక్కువగా బయటపెట్టే ప్రమాదం ఉంటుంది. కానీ ‘హైవాన్’ విషయంలో మేకర్స్ ఆ తప్పు చేయలేదు.
‘A mystery, a chase and a score that seems yet to be settled’ అనే కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా టీజర్‌ను రూపొందించారు. ఎవరు ఎవరిని వెంటాడుతున్నారు? అసలు ఈ ఇద్దరి మధ్య వైరం ఏంటి? గతంలో ఏం జరిగింది? ‘స్కోర్ సెటిల్’ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లోనే వదిలేశారు.
‘హైవాన్’కు మరో ప్రధాన ఆకర్షణ అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్. వీరిద్దరూ చివరిసారిగా 2008లో వచ్చిన ‘Tashan’లో కలిసి కనిపించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే సినిమాలో కనిపించడంతో ఈ రీయూనియన్పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అయితే ఈసారి వీరిద్దరూ కామెడీ లేదా ఫ్రెండ్షిప్ యాంగిల్లో కాకుండా ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌లో ఎదురెదురుగా కనిపించనుండటం ప్రత్యేకత. ఈ చిత్రం ఏ స్థాయిలో థ్రిల్ చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 11 వరకు ఆగాల్సిందే.