కోయిలమ్మ కూడా కొరియన్‌లోనే కూసే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ ‘కమ్సాహంనిదా’ను విడుదల చేసింది.

ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాట రితికా నాయక్ సరదాగా ‘కమ్సాహంనిదా’ అని పలకడంతో ప్రారంభమవుతుంది. దానికి అర్థం ఏమిటని వరుణ్ తేజ్ ఆసక్తిగా అడుగుతాడు. కొరియన్ భాషలో ‘ధన్యవాదాలు’ అనే సమాధానం చెప్పడం, వారి మధ్య ఉన్న ప్రేమకు చక్కటి నాంది పలుకుతుంది. ఈ పాటను సున్నితమైన కొరియన్ టచ్స్, ఆకట్టుకునే మెయిన్‌స్ట్రీమ్ ఎలిమెంట్స్ తో మేళవించి అద్భుతంగా కంపోజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రచన కొత్త ప్రేమలోని అమాయకత్వాన్ని ప్రజెంట్ చేయగా, సిద్ శ్రీరామ్ సాఫ్ట్ వోకల్స్ ఎమోషన్ ని మరోస్థాయికి తీసుకువెళ్తుంది. యాష్ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ పాటలోని హ్యాపీ వైబ్‌ను ప్రజెంట్ చేస్తూ విజువల్‌గా ఆకట్టుకుంటుంది.

మాస్, రగ్డ్ లుక్‌లో కనిపించిన వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎనర్జీతో కట్టిపడేశారు. రితికాతో ఆయన కెమిస్ట్రీ కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. థమన్ బీట్‌లకు తగ్గట్టు వీరి కాంబినేషన్ సాంగ్‌కు ఇన్‌స్టంట్ రీపీట్ ఫీల్‌ను ఇస్తుంది.

ఈ పాట సినిమా ప్రమోషన్స్‌కు సరైన జోష్ ఇచ్చింది. ఇందులో ప్రేమతో పాటు వినోదం కూడా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పుట్టినరోజున రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ వైరల్ అయింది. “కొరియన్ కనకరాజు” అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా హారర్-కామెడీగా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి కటాసాని అందిస్తుండగా, ఎడిటింగ్ సత్యా జి నిర్వహిస్తున్నారు.

షూటింగ్ దాదాపు పూర్తికావడంతో మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని