అభిమానులను ప్రశంసించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఏడాదికో సామాజిక కార్యక్రమం చేయమంటూ తన అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్గనిర్దేశం చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ ఏడాది హెచ్ పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న సందర్భంగా తన అభిమానులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు అల్లు అర్జున్. తను చెప్పినట్లు ఈ ఏడాది ఒక మంచి సామాజిక కార్యక్రమం చేస్తున్న అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.
యువతులు, మహిళలు హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవగాహన కార్యక్రమాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం తన అంచనాలు మించిందని అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన అభిమానులు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ గా నిలుస్తున్న మంత్రులు, రాజకీయ నేతలు, అధికారులకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ హితం కోసం చేసే ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని అల్లు అర్జున్ కోరారు. అల్లు అర్జున్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్ట్ కు అత్యధికంగా నెటిజన్స్ స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రశంసలు అందిస్తున్నారు.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని