kiran-abbavaram-chennai-love-story-top-grosser
కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.40.1 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. బ్లాక్‌బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో పాటు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుతమైన ఆదరణతో మొదటి వీకెండ్‌ను ఈ సినిమా అత్యంత విజయవంతంగా ముగించింది.
kiran-abbavaram-chennai-love-story-top-grosser

ఈ కలెక్షన్లతో ‘చెన్నై లవ్ స్టోరీ’ కిరణ్ అబ్బవరం సినీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గత చిత్రాల రికార్డులను అధిగమిస్తూ ఈ సినిమా కొత్త మైలురాయిని అందుకుంది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండో మరియు మూడో రోజుల్లో మరింత బలమైన వసూళ్లను నమోదు చేసింది. అన్ని ప్రధాన మార్కెట్లలో సినిమా మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతుండగా, ఓవర్సీస్లోనూ ప్రేక్షకుల స్పందన విశేషంగా ఉండటం విశేషం.
తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్లో “3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.40.1 కోట్లకు పైగా గ్రాస్” సాధించినట్లు ప్రకటించింది. ఈ అద్భుత స్పందనకు ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోన్న ‘చెన్నై లవ్ స్టోరీ’ తొలి వారంలోనే మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విజయంతో కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మెట్టుపైకి చేరిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.