సినిమాకు ప్రమోషన్ చేసే బడ్జెట్తో మరో మూవీ కంప్లీట్ చేయొచ్చని అంటున్నారు యువ నటుడు తిరువీర్. తను హీరోగా ఎస్పీ దుర్గ నరేష్ దర్శకత్వంలో ఈటీవీ విన్ సమర్పణలో రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి కలిసి నిర్మించిన ‘పాపం ప్రతాప్’ చిత్రం ఏప్రిల్ 17న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో ఓ క్రేజీ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. తిరువీర్ అసిస్టెంట్ ఒకరు.. ప్రమోషన్ షెడ్యూల్ ఇవ్వగా, ట్రైలర్ అనౌన్స్మెంట్, ప్రీ అనౌన్స్మెంట్ కు ఓ వీడియో, టెక్నికల్ ఇష్యూ వలన ట్రైలర్ లేట్ అయ్యిందని చెప్పడం, చిన్న, పెద్ద ఇన్ఫ్లూయెన్సర్స్ తో హుక్ స్టెప్స్, ట్రైలర్ సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ ఇవ్వన్నీ చదువుతూ… ఇన్ని ప్రమోషన్స్ ఎందుకు అన్నట్టుగా ఫన్నీగా విడుదల చేసిన వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను చిత్రీకరించడానికి మేకర్స్ ఎంత కష్టపడుతున్నారో.. అంతకంటే ఎక్కువగా ప్రమోషన్స్ కోసం ఫోకస్ పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా రిలీజ్ కంటే తీయడమే ఈజీగా దర్శక నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. ఓ సినిమాను జనాలదగ్గరకు తీసుకెళ్లడానికి నానాతిప్పలు పడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తిరువీర్ ఈ వీడియో రిలీజ్ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఈ ప్రమోషనల్ వీడియో మరింత క్యూరియాసిటినీని క్రియేట్ చేసింది.





