nag ashwin exclusive interview
దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన నాగ్ అశ్విన్.. నిర్మాతగా మాత్రం చాలా సెలెక్టివ్. కథలో ప్రత్యేకత కనిపిస్తేనే నిర్మాణ బాధ్యతలు తీసుకుంటారు. ‘జాతిరత్నాలు’ తర్వాత ఆయన నిర్మాతగా చేసిన చిత్రం *’సింగ్ గీతం’. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న కారణం కేవలం ఒక సినిమా కాదు.. ఒక లెజెండ్‌పై ఉన్న గౌరవం అని అంటున్నారు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కలల ప్రాజెక్ట్‌గా రూపొందిన ‘సింగ్ గీతం’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటల్లో ఆ గౌరవం, ప్రేమ, నమ్మకం స్పష్టంగా కనిపించాయి.
nag ashwin exclusive interview
సింగీతం కోసం నిర్మాతగా కాదు.. శిష్యుడిగా పనిచేశా!
నాగ్ అశ్విన్ మాటల్లో చెప్పాలంటే.. ఈ సినిమా కోసం ఆయన కేవలం నిర్మాత పాత్రకే పరిమితం కాలేదు. సింగీతం విజన్‌ను తెరపైకి తీసుకురావడానికి అసిస్టెంట్ డైరెక్టర్లా కూడా పనిచేశానని అన్నారు.
దాదాపు రెండేళ్ల పాటు సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ప్రయాణించడం తన జీవితంలో అరుదైన అనుభవమని చెప్పారు. “ఆయనను కలవడమే గొప్ప విషయం. అలాంటిది ప్రతిరోజూ మాట్లాడటం, ఆయనతో సినిమా చేయడం మాటల్లో చెప్పలేని ఆనందం” అంటూ భావోద్వేగంగా స్పందించారు.
‘పుష్పక విమానం’కు ముందే పుట్టిన కథ
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘సింగ్ గీతం’ కథ కొత్తది కాదు. ‘పుష్పక విమానం’ కంటే ముందే ఈ కథను కమల్ హాసన్ కు సింగీతం వినిపించారట. కానీ అప్పటి పరిస్థితుల వల్ల అది రూపుదాల్చలేదు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆ కల నిజమైందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
nag ashwin exclusive interview
ప్రపంచంలో ఎక్కడా రాని కాన్సెప్ట్?
సినిమాపై నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యల్లో ఇదే హైలైట్. “ఇలాంటి సినిమా ప్రపంచంలో ఇప్పటివరకు రాలేదు. భవిష్యత్తులో కూడా రావడం కష్టం” అని ఆయన ధైర్యంగా చెప్పడం విశేషం. సింగీతం గారు కూడా ఇదే మాట ఎప్పటినుంచో చెబుతున్నారని, సినిమా పూర్తయ్యాక తాను కూడా అదే ఫీలింగ్‌కు వచ్చానని నాగ్ అశ్విన్ తెలిపారు.
పాటల రూపంలో డైలాగ్స్.. అయినా ఎక్కడా బోర్ లేదు!
‘సింగ్ గీతం’లో అత్యంత ప్రత్యేకమైన అంశం డైలాగ్స్. సినిమాలోని సంభాషణలన్నీ పాటల రూపంలోనే సాగుతాయని, అయితే ప్రేక్షకుడు కొద్దిసేపటికే ఆ విషయాన్ని మర్చిపోయి కథలో పూర్తిగా లీనమైపోతాడని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్లో సినిమా చూసిన తర్వాత ప్రతి సీన్ ఎంటర్టైనింగ్గా అనిపించిందని, ఎక్కడా “పాట వింటున్నాం” అనే భావన రాదని చెప్పారు.
94 ఏళ్ల వయసులోనూ టీనేజర్లా ఆలోచిస్తున్న సింగీతం
నేటి యువ దర్శకులకంటే సింగీతం శ్రీనివాసరావే ఎక్కువగా కొత్తగా ఆలోచిస్తారని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆయన 94 ఏళ్ల వయసులో కూడా కొత్త తరం దర్శకుడే. ఈ సినిమా కూడా ఒక టీనేజర్ తీసినట్టుగా ఉంటుంది అని చెప్పడం ద్వారా సింగీతం క్రియేటివిటీని కొనియాడారు.
దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా ఇదో కొత్త ఛాలెంజ్
దేవి శ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా ‘సింగ్ గీతం’ఒక సరికొత్త ప్రయోగమట. సినిమా మొత్తం నాన్‌స్టాప్ మ్యూజిక్‌తో సాగినా.. ప్రేక్షకుడికి అది బ్యాక్‌గ్రౌండ్‌లో సహజంగా అనిపిస్తుందని నాగ్ అశ్విన్ వివరించారు. ఈ సినిమాకు సంగీతమే అతిపెద్ద బలం అవుతుందని చెప్పారు.
nag ashwin exclusive interview
పదేళ్ల తర్వాత కూడా మాట్లాడుకునే సినిమా!
నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత బలమైనది ఇదే. ‘వారం రోజులు చూసి మర్చిపోయే సినిమా కాదు. పదేళ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేశాం’ అని ఆయన స్పష్టం చేశారు. అందుకే ‘సింగ్ గీతం’ ను ఒక సాధారణ సినిమా కాకుండా.. సింగీతం శ్రీనివాసరావు వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసే ప్రత్యేక చిత్రంగా భావిస్తున్నారు.
‘కల్కి 2’పై కూడా క్లారిటీ
ఇక అభిమానులు ఎదురుచూస్తున్న కల్కి 2898 AD సీక్వెల్ గురించి కూడా నాగ్ అశ్విన్ అప్డేట్ ఇచ్చారు. ‘ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యూగా షూటింగ్ చేసి శరవేగంగా పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’ అని వెల్లడించారు.
nag ashwin exclusive interview
మొత్తానికి.. ‘సింగ్ గీతం’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన ప్రతి మాటలో ఒక నమ్మకం కనిపించింది. సింగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్గజ దర్శకుడి కలల ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నిలిచిన ఆయన.. ఇది కేవలం సినిమా కాదు, తరాలు గుర్తుంచుకునే అనుభవమని చెబుతున్నారు.