Chiru, Bobby shooting in Pollachi
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ప్రెస్టేజీయస్ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్గా హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసిన యూనిట్, అక్కడ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించింది. ముఖ్యంగా చిరంజీవి పాత్రకు సంబంధించిన కొన్ని ఎమోషనల్, ఎంటర్టైనింగ్ సీన్స్‌ను ఈ షెడ్యూల్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం జూన్ 1 నుంచి తమిళనాడులోని అందమైన లొకేషన్ పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రకృతి అందాల మధ్య జరిగే ఈ షెడ్యూల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ పరంగా సాగుతున్నాయని, వీలైనంత త్వరగా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తిచేసేలా పక్కా ప్లానింగ్‌తో జరుగుతోంది.
Chiru, Bobby shooting in Pollachi
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ టార్గెట్ పెట్టుకుంది. అందుకే గ్యాప్ లేకుండా బ్యాక్ బ్యాక్ టు షెడ్యూల్స్‌తో షూట్ పూర్తిచేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుంది.
Chiru, Bobby shooting in Pollachi
ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తుంది. చిరంజీవి కూతురి పాత్రలో ఆమె కనిపించనుంది. ఇక నారా రోహిత్ ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్ వంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.